దేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే లోహాల్లో ఒకటి బంగారం. మహిళలే కాదూ పురుషులు కూడా దీనిపై మక్కువ పెంచుకుంటున్నారు. బంగారం కొనుగోలు చేయడం వల్ల లాభమే కాని నష్టం లేదని తెలివి ఎరిగి పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు.
దేశంలో అత్యధికంగా కొనుగోలు చేసే లోహాల్లో ఒకటి బంగారం. మహిళలే కాదూ పురుషులు కూడా దీనిపై మక్కువ పెంచుకుంటున్నారు. బంగారం కొనుగోలు చేయడం వల్ల లాభమే కాని నష్టం లేదని తెలివి ఎరిగి పసిడిపై పెట్టుబడులు పెడుతున్నారు. పసిడి కొనుగోలు చేయడం వల్ల స్వామి కార్యం, స్వకార్యం రెండూ చేకూరుతుంటాయి. అయితే బంగారం కొనాలనుకుంటే ముందు బంగారం ధరతో పాటు ప్రకటనలు చూస్తుంటారు. ఏ షోరూమ్‌లో తక్కువ ధర ఉంది, మజూరు లేదు లేదా మార్కెట్ ధరల కన్నా తక్కువ ప్రైజ్, ఇంత కొనుగోలు బంగారంపై వెండి ఫ్రీ అంటూ ప్రకటనలు చూసి పరుగులు పెడుతుంటారు. పండుగ, పబ్బాలతో సంబంధం లేకుండా షాపులకు క్యూ కడుతుంటారు.
బంగారం కొనాలంటే ఇప్పుడు అందరు నగరంలోని పెద్ద పెద్ద షాపుల్లోనే. ప్రకటనలు చూసి, మంచి డిజైన్లు దొరుకుతున్నాయంటూ వెళుతుంటారు. అయితే అందులో మోసం ఎలా జరుగుతుందో పక్కనపెడితే.. తయారీకి, అమ్మకానికి, ప్రచారానికి పడే అన్నీ చార్జీలు కూడా మన దగ్గర నుండే వసూలు చేస్తుంటారని వ్యాపార నిపుణులు అంటున్నారు. కానీ.. గతంలో ఈ షాపులన్నీ లేనప్పుడు ఎక్కడ బంగారం కొనుగోలు చేసేవారు? తాత, తండ్రుల తరంలోని మంచి ఆభరణాలు, ఇప్పటికీ చెక్కు చెదరకుండా కళ్లు జిగేలు మనేలా నగలు చూస్తుంటే.. ఎక్కడ చేయించుకునే వారు అన్న అనుమానం రాకపోదు. అయితే గతంలో ప్రతి ఊరిలో స్వర్ణకారులు ఉండేవారు. వారు ఈ వృత్తిపైనే జీవించి బతికేవారు. వీరి వ్యాపారం అంతా కూడా నమ్మకంపైనే ఆధారపడి ఉండేది. అంటే వస్తువు తాయరు చేసి ఇవ్వడంలోనే కాదూ.. కస్టమర్, స్వర్ణకారుడి మధ్య బలమైన బాండ్ ఉండేది.
ఏదైనా వస్తువు చేయించుకోవాలంటే ఆ ఊరి ప్రజలు తమకి నచ్చిన స్వర్ణకారుడి షాప్ దగ్గరకు వెళ్లేవారు. తమకు నచ్చిన వస్తువు తయారు చేసి ఇచ్చేందుకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకునేవారు. బంగారం ఆ రోజు ఎంత ధర ఉందో అంతే తీసుకునేవారు ఆ బంగారం వ్యాపారి కూడా. అయితే.. అదే సమయంలో తమ దగ్గర ఆ నగలకు సరిపడా డబ్బులు లేకపోయినా.. మూడొంతులు, ఒక్కోసారి సగం చెల్లించి.. ఆ తర్వాత ఇన్‌స్టాల్‌మెంట్‌లో కట్టించుకునే వారు. కస్టమర్లను నమ్మి, సగం డబ్బులకే నగలు చేసి వారి చేతికిచ్చేవారు బంగారం వ్యాపారస్తులు. ఉదాహరణకి ఒక ఊరిలో రాజయ్య అనే వ్యక్తి ఉన్నాడు అనుకుందాం. అతని కూతురికి సడెన్ గా పెళ్లి కుదిరింది. 10 తులాల బంగారం పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు తులం బంగారం 60 వేలు కాబట్టి.. రాజయ్య దగ్గర 6 లక్షలపైనే ఉండాలి. ఇలాంటి సమయంలోనే ఆ ఊరి ప్రజలను స్వర్ణకారులు ఆదుకునేవారు. వారు కేవలం మూడు, నుండి నాలుగు లక్షలు తీసుకుని వివాహానికి కావాల్సిన బంగారం సిద్ధం చేసి ఇచ్చేవారు. మిగిలిన మొత్తన్ని వడ్డీతో కలిపి నెలవారీ తీసుకునేవారు. అది కూడా.. ఆరోజు బంగారం ఉన్న ధరని మాత్రమే తీసుకునేవారు.
నిజానికి ఇలా ఊరిలో అందరికీ స్వర్ణకారులు ఇవ్వరు. ఏ కుటుంబం అయితే.. తరతరాలుగా తమ వద్దే నమ్మకంగా బంగారం చేపించుకుంటూ ఉంటుందో వారికి మాత్రమే ఈ వెసులుబాటు ఉంటుంది. అయితే.. ఇదంతా గతం అనుకుంటున్నారు ఏమో! ఇప్పటికీ ఇలా బంగారం తీసుకునే కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇలా.. నమ్మకంగా స్వర్ణకారుల దగ్గర బంగారం తీసుకునే వారికి మరో లాభం కూడా ఉంది. అది ఎలాగో మరో ఉదాహరణతో చూద్దాం. ఓ కుటుంబానికి చేతిలో ఒకటిన్నర లక్ష డబ్బు ఉంది. అప్పు మాత్రం రెండున్నర లక్ష ఉంది. 20 రోజుల్లో మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి. ఇలాంటప్పుడు కూడా.. చేతిలో ఉన్న డబ్బుతో స్వర్ణకారుల వద్ద ఒక 5 తులాల బంగారం కొనుక్కోవచ్చు. మిగిలిన సగాన్ని ఇన్‌స్టాల్‌మెంట్లో కట్టుకోవచ్చు. ఆ 5 తులాల బంగారాన్ని ఏదైనా బ్యాంక్ లో పెడితే.. కచ్చితంగా రెండున్నర లక్షల కన్నా ఎక్కువ మొత్తమే వస్తుంది. అప్పుడు బయట తీర్చాల్సిన మొత్తం అప్పుకి సరిపోతోంది.
ఎలాగో చేతిలో ఉద్యోగం ఉంటుంది కాబట్టి.. నెలా.. నెలా బ్యాంకులో కొంత, స్వర్ణకారుడికి కొంత కట్టుకుంటూ పోతే.. అటు అప్పు తీరిపోతుంది. ఇటు ఒక బంగారపు వస్తువు మిగులుతుంది. ఈ మొత్తం వ్యవహారంలో కాస్త వడ్డీ భారం పడ్డా కూడా.., ఎవరి వద్దా చేయి చాచి అడగాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. ఆత్మ గౌరవం దెబ్బ తినకుండా ఉంటుంది. కానీ.., ఇప్పుడు సిటీల్లో దీనికి పూర్తి భిన్నమైన పద్దతిలో అందరూ బంగారం కొంటున్నారు. ముందు ఇన్‌స్టాల్‌మెంట్ పద్ధతిలో మనం డబ్బులు కట్టాలి. టార్గెట్ నెలలు పూర్తయ్యాక అప్పుటి ధరను బట్టి మనకి నగలను ఇస్తున్నారు. అంటే.. పూర్తి రివర్స్ అనమాట! చూశారు కదా? నమ్మకంగా స్వర్ణకారుల వద్ద బంగారం కొనడం ఎంత లాభమో? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.