ఈ రోజు హైదరాబాద్ లో స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు

  • Written By:
  • Publish Date - October 30, 2021 / 11:31 AM IST

స్వల్పంగా తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్150 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 160 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,700.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,770.
1కిలో వెండి 68,900

బిజినెస్ డెస్క్- ఈ రోజు శనివారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. శుక్రవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 16 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు తగ్గి 44 వేల 700 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 160 రూపాయలు తగ్గి 48 వేల 770 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 100 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 68 వేల 900 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 150 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 170 రూపాయలు పెరిగింది.

అటు చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 45 వేల 060 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 49,160 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 47,050 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 48,050 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,990 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 51,260 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.

Show comments
SHARE THIS ARTICLE ON
Read Today's Latest businessNewsTelugu News LIVE Updates on SumanTV