స్వల్పంగా తగ్గిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 300 రూపాయలు తగ్గింది.
10గ్రా 24 క్యారెట్ 330 రూపాయలు తగ్గింది.
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,000.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,000.
1కిలో వెండి 67,800
బిజినెస్ డెస్క్- ఈ రోజు గురువారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. బుధవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 30 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 33 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 300 రూపాయలు తగ్గి 44 వేల రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 330 రూపాయలు తగ్గి 48 వేల రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 100 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 800 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 400 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 440 రూపాయలు తగ్గింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 300 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,330 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45,780 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,780 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,150 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,350 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.