జంషెడ్‌పూర్ – మామిడి పళ్ల పేరు వింటేనే నోరు ఊరుతుంది. వేసవి కాలం సీజన్ లో మామిడి పళ్లు తినేందుకు అంతా ఉబలాటపడుతుంటారు. ఇక మామిడి పళ్లు కిలో వంద, రెండు వందలు.. మహా ఐతే ఆదు వందల రూపాయలు ఉంటాయి. కానీ ఓ వ్యాపారవేత్త ఒక్కో మామిడి పండును పది వేల రూపాయలు పెటిటి కొన్నాడు. రోడ్డు పక్కన మామిడి పళ్లు అమ్ముతున్న ఓ బాలిక నుంచి ఆయన 12 మామిడి పళ్లు కొని 1లక్షా 20 వేస రూపాయలు ఇచ్చాడు. అదేంటీ ఒక మామిడి పండు 10 వేల రూపాయలు ఏంటీ అని ఆశ్చర్యపోతున్నారా.. అసలు సంగతి ఏంటంటే..
ఆన్‌లైన్‌లో చదువుకునేందుకు స్మార్ట్ ఫోన్ కొనుక్కునే స్థోమత లేక రోడ్డుపై మామిడి పళ్లు అమ్ముకుంటూ జీవనం సాగిస్తోంది ఓ బాలిక. బాగా చదువుకునే ఆ బాలిక ఆన్ లైన్ క్లాసుల నేపధ్యంలో ఫోన్ కొనుక్కోలేక చదువు ఆపేయాల్సి వచ్చింది. జంషెడ్‌పూర్ బాలిక తులసి కుమారి గురించి స్థానిక న్యూస్ చానెళ్లలో వార్తలు వచ్చాయి. ఆన్ లైన్ క్లాసులు వినాలంటే స్మార్ట్ ఫోన్ కావాలని, తన వద్ద అంత డబ్బులేదని, ఈ మామిడి పళ్లను అమ్మి, డబ్బు సంపాదించి ఓ ఫోన్ కొనుక్కోవాలనుకుంటున్నానని తులసి చెప్పుకొచ్చింది. ముంబైకి చెందిన వ్యాపారవేత్త అమెయా హేతే తులసి పరిస్థితి చూసి చలించిపోయా
స్మార్ట్ ఫోన్ కొనే స్థోమత లేక చదువుకు దూరమై రోడ్డు పక్కన మామిడి పళ్లు అమ్ముకుంటున్న తులసికి సాయం చేసేందుకు ఈ వ్యాపారవేత్త ముందుకు వచ్చారు. ఆ బాలిక అమ్ముతున్న మామిడి పళ్లను ఒక్కక్కొటి 10వేలు చొప్పున, మొత్తం డజను పళ్లను లక్షా 20వేలకు కొనుగోలు చేశాడు. దీంతో తులసి ఆనందానికి అవధ్దుల్లేకుండా పోయాయి. ఆ డబ్బంతా ఉచితంగా ఇస్తే తులసి ఆత్మాభిమానం దెబ్బతింటుందని, అందుకే ఆమె నుంచి మామిడి పళ్లు తీసుకున్నానని వ్యాపారవేత్త అమెయా తెలిపారు.