ఫ్లాష్ ఫ్లాష్!!.
దేశవ్యాప్తంగా పెట్రోల్ మరియు డీజిల్ ధరలు ఆకాశాన్నంటిన సంగతి తెలిసిందే. పెరుగుతున్న పెట్రోల్ ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో సెంచరీ దాటేశాయి పెట్రోల్ ధరలు. అటు డీజిల్ కూడా పెట్రోల్ తో పోటీపడుతోంది. అయితే ఈ నేపథ్యంలో లో పెట్రోల్ ధరలపై కేంద్రమంత్రి హార్దిప్ సింగ్ పూరి కీలక ప్రకటన చేశారు. పెట్రోల్ మరియు డీజిల్ ధరలపై త్వరలోనే దేశ ప్రజలు ఒక శుభవార్త వింటారు అని ఆయన పేర్కొ న్నారు. రానున్న కొద్ది నెలల్లో వాటి ధరల భారం నుంచి ఉపశమనం లభించే అవకాశం ఉందని తెలిపారు.
అంతర్జాతీయంగా చమురు ధరలు నెమ్మదిగా వస్తున్నాయని ఢిల్లీలో విలేకరుల సమావేశం ఈ సందర్భంగా ఆయన వివరించారు. పెట్రోల్ ధరలపై వచ్చిన ఆదాయాన్ని వ్యాక్సిన్ లపై ఖర్చు చేస్తున్నామని ఆయన ప్రకటించారు. పెట్రోల్ ధరల అంశాన్ని ప్రభుత్వం అత్యంత సున్నితమైనదిగా భావిస్తోందని అదే సమయంలో ఇతర బాధ్యతలు కూడా సున్నితమైనవేనని ఆయన తెలిపారు.
లీటర్ పెట్రోల్‌పై కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను యథావిధిగా రూ.32 ఉందని కానీ అంతర్జాతీయంగా ధరల పెరుగుదలకు అనుగుణంగా రాష్ట్రాలు వ్యాట్‌ను పెంచడం వల్లే ధరలు పెరుగుతున్నాయని చెప్పారు. ప్రస్తుతం క్రూడ్ ఆయిల్ ధరలు 119 శాతం మేర పెరిగాయి. 2020 మే నెలలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 30.61 డాలర్లుగా ఉండగా ఈ ఏడాది మే లో ఇది 66.95 డాలర్లకు పెరిగింది.