పోలీస్ వ్యవస్థ పై ప్రజల్లో భిన్న మైన అభిప్రాయాలు ఉంటాయి. విధి నిర్వహణలో పోలీసులు కఠినంగా వ్యవహరించడంతో ప్రజల్లో ఓ రకమైన భయం ఉంటుంది. పోలీసులు నిత్యం ప్రజల రక్షణ కోసం తమ కుటుంబ జీవితాలను కూడా త్యాగం చేస్తుంటారు. ఇదే సమయంలో కొందరు పోలీసుల తీరు జనాలకి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు పోలీసులు.. రోడ్డు వెంబడి పండ్లు అమ్ముకునే వారిని ఇబ్బందులు పెట్టడుతుంటారు. తాజాగా ఓ పుచ్చకాయలు అమ్ముకునే వ్యక్తి.. తక్కువ ధరకు ఇవ్వలేదని ఓ పోలీసు చేయి చేసుకున్నాడు. దీంతో తనను అన్యాయంగా కొట్టారంటూ పోలీసుల వాహన ముందు బైఠాయించాడు సదరు వ్యక్తి. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
పోలీసు వ్యవస్థలో అవినీతి లేదని, మేము ఫ్రెండ్లీ పోలీసులం, జనాలతో చాలా మర్యాద నడుచుకుంటాం అని పోలీస్ ఉన్నాధికారులు అంటుంటారు. కానీ వాస్తవం వేరేగా ఉంటుందని చాలా మంది అభిప్రాయా పడుతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకి పీఎస్ పరిధిలోనే వెంకటేశ్వర్లు అనే వ్యక్తి వాటర్ మిలన్ కాయలు అమ్ముతున్నాడు. ఇంతలో అక్కడి వచ్చిన కానిస్టేబుల్ తక్కువ ధరకు ఇవ్వమని అడిగాడు. దీంతో అందరికి ఇచ్చే ధరకే ఇస్తాను సార్ .. అని చెప్పడంతో అతడిపై కానిస్టేబులు చెంప దెబ్బలు కొట్టినట్లు సమాచారం.
అయితే నన్ను అన్యాయంగా కొట్టారని పోలీసుల వాహనాన్ని ముందు వెంకటేశ్వర్లు బైఠాయించాడు. అసలే పోలీసులు.. ఇక పండ్ల కోసం కక్కుర్తి పడ్డారని నిందలేస్తే ఊరుకుంటారా? అతడిని ఏమి చేస్తారో.. అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. మీరు.. ఈ వీడియోపై ఓ లుక్కేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.