Orissa: స్నేహమనే మాటకే కలంకం తెచ్చారు కొందరు స్నేహితులు. తాగిన మత్తులో ఓ మిత్రుడి ప్రైవేట్ పార్టులోకి స్టీల్ గ్లాసును జొప్పించారు. ఈ దారుణ ఘటన గుజరాత్‌లోని సూరత్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఒరిస్సా, గంజాంలోని ఓ గ్రామానికి చెందిన కృష్ణ రౌత్ అనే 45 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం గుజరాత్‌లోని సూరత్‌కు వెళ్లాడు. అక్కడ జరిగిన ఓ పార్టీలో పాల్గొన్నాడు. పార్టీ సందర్భంగా తన స్నేహితులతో కలిసి మద్యం సేవించాడు. పూర్తిగా మద్యం మత్తులో మునిగిపోయిన వారు విచక్షణ కోల్పోయారు. బలవంతంగా కృష్ణ రౌత్ ప్రైవేట్ పార్టులో స్టీల్ గ్లాసును జొప్పించారు.
అయితే, మద్యం మత్తులో ఉన్న అతడికి ఆ విషయం గుర్తులేదు. ఇక, మరుసటి రోజు నుంచి బ్యాక్‌లో నొప్పిరావటం మొదలైంది. తన ప్రైవేట్ పార్టులో నొప్పి వస్తోందని కుటుంబసభ్యులకు చెప్పలేకపోయాడు. నొప్పి విపరీతంగా పెరిగిపోవటంతో తన సొంతూరైన ఒరిస్సా లోని గ్రామానికి వచ్చాడు. ఊరు చేరుకోగానే అతడి పరిస్థితి మరింత దారుణంగా మారింది. కడుపు వాచిపోయింది. మలానికి వెళ్లటం కుదరలేదు. ఈ నేపథ్యంలో కుటుంబసభ్యులు అతడ్ని ఆసుపత్రికి వెళ్లమని సలహా ఇచ్చారు. దీంతో కృష్ణ ఎమ్‌కేసీజీ కాలేజ్ ఆసుపత్రికి వెళ్లాడు.
డాక్టర్లు అతడ్ని ఎక్స్‌రే చేయించుకోమని సలహా ఇచ్చారు. అతడు ఎక్స్‌రే చేయించుకోగా, ప్రైవేట్ పార్టులో గ్లాసు ఉన్నట్లు బయటపడింది. డాక్టర్లు దాన్ని మామూలుగా తీయటానికి ప్రయత్నించి, విఫలమయ్యారు. తర్వాత సర్జరీ చేశారు. ప్రైవేట్ పార్టును కోసి స్టీల్ గ్లాసును బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు. మరి, ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : ఫామ్ హౌస్‌లో క్యాసినో- రేవ్ పార్టీ.. అడ్డంగా దొరికిన పోలీసు అధికారులు, ప్రభుత్వ టీచర్!