కరోనా కష్ట కాలం నుండి బయటపడాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గం. ప్రపంచదేశాలన్నీ ఈ విషయంలో యుద్ధ ప్రాతిపదికన పని చేస్తున్నాయి. ఇందుకు మన దేశం ఏమి మినహాయింపు కాదు. కేంద్ర, రాష్ట్ర ప్రభత్వాలు కలసి ఇప్పటి వరకు 20 కోట్ల మందికి పైగానే వ్యాక్సినేషన్ పూర్తి చేశాయి . కానీ.., ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయం లోపించడంతో వ్యాక్సినేషన్ పై నీలి నీడలు కమ్ముకున్నాయి. కానీ..,
ఇలాంటి వేళ దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రజలందరికీ గుడ్ న్యూస్ అందించారు. ఇకపై వ్యాక్సినేషన్ బాధ్యతను పూర్తిగా కేంద్రమే తీసుకుంటుందని.., దేశమంతా ఫ్రీగా వ్యాక్సిన్ అందించనున్నట్టు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. ఇక రాష్ట్రాలు వ్యాక్సిన్ పై ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేదని, ఆ బాధ్యత అంతా కేంద్రానిదే అని ఆయన స్పష్టం చేశారు.
ఈ ప్రాసెస్ లో కేంద్రమే వ్యాక్సిన్లు కొనుగోలు చేసి రాష్ట్రాలకు అందిస్తుందని మోదీ తెలిపారు. ఈ నెల 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేయనున్నట్లు ఆయన చెప్పారు. ఇందులో భాగంగా ఇక దేశంలో 18 ఏళ్ళు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఫ్రీగా అందనుంది. నిజానికి వ్యాక్సిన్ డ్రైవ్ విషయంలో కేంద్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా విమర్శలు ఎదుర్కొంటు వచ్చింది.
దేశంలో కరోనా ఫస్ట్ వేవ్ ముగిశాక వ్యాక్సిన్ మైత్రి పేరుతో కేంద్ర ప్రభుత్వం 70కి పైగా దేశాలకు వ్యాక్సిన్స్ పంపింది. తరువాత కాలంలో ఈ నిర్ణయాన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు తప్పు పట్టాయి. ముందు దేశ ప్రజలకు ఇవ్వకుండా విదేశాలకు ఎక్కువ ఇచ్చేశారని…
దాని వల్ల దేశంలో వ్యాక్సిన్ డ్రైవ్ సరిగ్గా జరగలేదని ఆరోపించాయి. అయితే.., ఇప్పుడు మోదీ తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ విమర్శలు అన్నిటికీ చెక్ పెట్టినట్టు అయ్యింది. దేశ ప్రజలకి ఫ్రీ వ్యాక్సిన్ అందే ఈ సమయంలోనే ప్రైవేట్ వాక్సినేషన్ కూడా అందుబాటులో ఉంటుందని మోదీ ప్రకటించారు.
ప్రపంచంలో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలు చాలా తక్కువని, మనం వ్యాక్సిన్ ఉత్పత్తి చేసుకోకపోతే విదేశాల నుంచి రావడానికి ఏళ్లు పట్టేదన్నారు. ఈ సందర్భంగా దేశీయ వైద్య నిపుణలను ప్రధాని ప్రశంసలతో ముంచెత్తారు.
ఇక దేశంలో మెడికల్ ఆక్సిజన్ ఉత్పత్తిని 10 రెట్లు పెంచామని, ఆర్మీ, నెవీ, ఎయిర్‌పోర్స్ అన్నీ ఉపయోగించి ఆక్సిజన్ కొరత తీర్చామని మోదీ గుర్తు చేశారు. ఇదే సమయంలో చిన్నారుల టీకా కోసం కూడా దేశీయంగానే ప్రయత్నాలు కొనసాగుతున్నాయని, ఈ ప్రయోగాలు ఫలిస్తే మంచి ఫలితాలు ఉంటాయని ప్రధాని విశ్వాసం వ్యక్తం చేశారు. ఏదేమైనా..,
దేశ ప్రజలు అందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందించాలని ప్రధాని తీసుకున్న ఈ నిర్ణయానికి అన్నీ వైపుల నుండి మద్దతు లభిస్తోంది.మరి.. ప్రధానిగా మోదీ తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.