పిల్లలు అనగానే గుర్తుకొచ్చేది వారి ముఖంలోని అమయకత్వం. అలాంటి క్యూట్ ఫేస్ తో వచ్చి రానీ మాటలు మనందరిని ఆకట్టుకుంటాయి. వారు చేసే అల్లరి మాములుగా ఉండదు. అలానే కొందరు పిల్ల అద్భుతమైన ట్యాలెంట్ కలిగి ఉంటారు. అలాంటి పిల్లలను చూసినప్పుడు ఆశ్చర్యపోవడం మనవంతు అవుతోంది. తాజాగా ఓ చిన్నారి అద్భుతంగా కరాటే చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది.
వివరాల్లోకి వెళ్తే.. ఆ చిన్నారి పేరు మనుశ్రీ సక్సేనా. వయస్సు కేవలం నాలుగేళ్లు మాత్రమే. సాధారణంగా ఈ వయస్సు పిల్లలు బడికి వెళ్లమని మారం చేస్తుంటారు. కానీ మనుశ్రీ అలా కాదు. అడుగులు వేయడం మొదలు పెట్టినప్పటి నుంచి ఆ చిన్నారిని ఆమె తల్లిదండ్రులు ఓ ప్రత్యేకత ఉండాలి అనుకున్నారు. మాటలు రావడం మొదలు కరాటే క్లాసుల్లో జాయిన్ చేశారు. మనుశ్రీ ముందుగా కరాటేను పిల్లలతో ఆడుకునే ఆటలాగే అనుకుంది. అలా తెగ ఎంజాయ్ చేస్తూ నేర్చుకున్న కరాటే.. వరల్డ్ రికార్డ్ నెలకొల్పింది.ప్రపంచంలోనే కరాటే బ్లాక్ బెల్ట్ సాధించిన అతి చిన్నవయసురాలిగా పేరు గడించింది. అంతే కాదు ఇండియా బుక్ రికార్డ్స్‌తో పాటు ఆసియా బుక్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకుంది.
2020లో జరిగిన టోక్యో గేమ్స్‌లో కరాటే పోటీలతో అడుగుపెట్టిన చిన్నారి ఇప్పుడు పతకాల సాధించడంలో దూసుకుపోతోంది. మనుశ్రీ సక్సేనా మార్షల్స్ ఆర్ట్స్‌లోనే కాదు డ్యాన్స్‌లో ఎంతో నైపుణ్యం కలిగిఉంది. ఓవైపు కరాటే శిక్షణతో పాటు అంతర్జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటూనే చదువులో కూడా రాణిస్తోంది. జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొని అనేక పతకాలు సాధించింది. ఇక ప్రధాని మోదీకి కూడా కరాటే నేర్పిస్తానంటోంది ఈ చిన్నారి. దేశ శత్రువులతో ప్రధాని పోరాడేలా ట్రైనింగ్ ఇస్తా అని చెప్పి నవ్వులు పూయిస్తుంది. మరి.. ఈ చిన్నారిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.