అసెంబ్లీ ఎన్నికల వేల విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమైంది.
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల వేల విషాద ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి పరమేశ్వరపై గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. ఈ ఘటనలో ఆయన తలకు తీవ్ర గాయమైంది. హుటాహుటీన ఆయనను అక్కిరాంపురాలోని స్థానిక ప్రాథమిక వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. అనంతరం అక్కడినుండి తుమకూరులోని శ్రీ సిద్ధార్థ మెడికల్ కాలేజ్‌కు తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యపరిస్థితి నిలకడగా ఉందని సమాచారం. ఈ ఘటన కర్ణాటకలోని కొరాటగిరి నియోజకవర్గంలో చోటుచేసుకుంది.
మరోవైపు.. అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడటంతో అన్ని పార్టీలు జోరు పెంచాయి. ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. రాహుల్ గాంధీ బళ్లారిలో రోడ్ షో నిర్వహించగా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా దావణగెరెలో పర్యటించారు. ఇదిలావుంటే ప్రధాని మోదీపై కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలు అగ్గి రాజేస్తున్నాయి. మోదీని విష పాముతో పోల్చిన ఖర్గే.. ఆయననలో విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారని అన్నారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. మరోవైపు మోదీ ఈ నెల 29 నుండి కర్ణాటకలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. హుమ్నాబాద్, విజయపుర, బెంగళూరు, కోలార్, చెన్నపట్న, బెలూర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. కాగా, కర్ణాటకలో మే 10న ఎన్నికలు జరగనుండగా, మే 13న ఫలితాలు వెలువడనున్నాయి.
#WATCH | Karnataka: Former Deputy CM and Congress leader, G Parameshwara suffered an injury in his head while campaigning in Koratagere constituency. The incident occurred when someone in the crowd reportedly pelted stones at him.
As per the health officer of primary health… pic.twitter.com/L3UD13B4Fl
— ANI (@ANI) April 28, 2023