ప్రజలచే, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు.. వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. ప్రజా సేవకే పాటు పడాల్సిన శాసన కర్తలు.. వ్యామోహాలకు గురై అవమానాలు పాలవుతున్నారు.
ప్రజలచే, ప్రజల కోసం ఎన్నుకోబడిన ప్రజా ప్రతినిధులు.. వక్రబుద్ధి ప్రదర్శిస్తున్నారు. ప్రజా సేవకే పాటు పడాల్సిన శాసన కర్తలు.. వ్యామోహాలకు గురై అవమానాలు పాలవుతున్నారు. అధికారం ఉంది కదా అని ఏదీ చేసినా చెల్లుతుందని భావిస్తున్నారో ఏమో..మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తిస్తూ వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవల కాలంలో పలువురు రాజకీయ నేతలు, మంత్రులపై లైంగిక ఆరోపణలు పాల్పడిన ఘటనలు చూశాం. తాజాగా ఇప్పుడు ఓ మాజీ ముఖ్యమంత్రి కొడుకు కూడా ఈ ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఇంతకు ఆ మాజీ సీఎం, ఆ కొడుకు ఎవరంటే.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం కుమారుడు, అన్నాడీఎంకె ఎంపీ రవీంద్రనాథ్‌పై ఈ ఆరోపణలు వచ్చాయి.
థేనీ ఎంపీ రవీంద్రనాథ్ కోరిక తీర్చాలంటూ తనను వేధిస్తున్నారంటూ ఓమహిళా డీజీపీకి ఫిర్యాదు చేసింది. గత ఏడాది అక్టోబర్ నుండి ఇలా వేధిస్తున్నాడంటూ పేర్కొంది. న్యూడ్ కాల్స్ చేయాలని వేధించడమే కాకుండా, లొంగకుంటే చంపేస్తానంటూ బెదిరించినట్లు తెలిపింది. గతంలో తాంబారం పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వెలిబుచ్చింది. కాగా, రవీంద్రనాథ్ మరో చిక్కుల్లో పడ్డారు. 2019 ఎన్నికల అఫిడవిట్‌లో రవీంద్రనాథ్ తన ఆస్తులు తప్పుగా చూపారంటూ ఓ ఓటర్ వేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన మద్రాస్ హైకోర్టు.. ఆయన ఎన్నిక చెల్లదని జులైలో తీర్పునిచ్చింది. అయితే సుప్రీంకోర్టులో సవాలు చేసుకునేందుకు వీలుగా.. ఈ తీర్పును నెల రోజుల పాటు వాయిదా వేసింది. ఈ సమయంలోనే అతడిపై ఈ ఆరోపణలు చేస్తూ మహిళ డీజీపీకి ఫిర్యాదు చేసింది.