ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పలువుర్ని బలి తీసుకుంటున్నాయి. ప్రముఖులు కూడా గతంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఆదివారం ఆలూరు మాజీ ఎమ్మెల్యే నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. కర్నూలు నుండి హైదరాబాద్ వెళుతుండగా బీచుపల్లిలో ఆమె కారు ప్రమాదానికి గురైంది
ఇటీవల వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పలువుర్ని బలి తీసుకుంటున్నాయి. ప్రముఖులు కూడా గతంలో రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. ఆదివారం కర్నూలు జిల్లా ఆలూరు మాజీ ఎమ్మెల్యే, బీజెపీ నేత నీరజా రెడ్డి రోడ్డు ప్రమాదంలో మరణించారు. నీరజారెడ్డి కారు రోడ్డు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో ఆమె దుర్మరణం చెందారు. కర్నూలు నుండి హైదరాబాద్ వెళుతుండగా బీచుపల్లిలో ఆమె కారు ప్రమాదానికి గురైంది. ఒక్కసారిగా కారు వెనుక టైరు పేలడంతో అదుపు తప్పిన వాహనం పల్టీలు కొట్టింది. ప్రమాదం ధాటికి నీరజ తల, శరీరానికి తీవ్ర గాయలయ్యాయి. ఈ ఘటనలో కారు కూడా నుజ్జునుజ్జుయింది.
తీవ్ర గాయాలైన ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లిన కొద్ది సేపటికే ప్రాణాలు విడిచారు. నీరజారెడ్డి 2009లో ఆలూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 2011లో నియోజకవర్గంలో పనులు సరిగా జరగడం లేదని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి రాజకీయాలకు దూరంగా ఉన్నారు. మళ్లీ 2019లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం పనిచేశారు. తర్వాత ఉన్నట్టుండి ఆమె అధికార పార్టీ నుండి 2020 డిసెంబర్ లో బీజెపిలో చేరారు. ప్రస్తుతం ఆమె ఆలూరు బీజెపీ ఇన్ చార్జ్ గా వ్యవహరిస్తున్నారు. కాగా, ఆమె భర్త శేసిరెడ్డి గతంలో చనిపోయాడు.