కోర్టు తీర్పులు ఎప్పుడు, ఎలా ఉంటాయో ఎవ్వరూ ఊహించలేరు. ఒక్కోసారి కచ్చితంగా తప్పు అనుకున్న వాటిని కోర్టులు చిన్న తప్పుగా పరిగణిస్తాయి. అసలు ఇవి తప్పు కాదు అనుకున్నవే.. తీవ్రమైన నేరాల కిందకి వస్తుంటాయి. అయితే.., ఈ తీర్పులన్నీ రాజ్యాంగాన్ని అనుసరించి చట్టపరంగానే ఉంటాయి. కాకుంటే.. సామాన్యలమైన మనకి ఆ సెక్షన్స్ అర్ధం కాక, ఇలా తీర్పులు వింతగా అనిపిస్తుంటాయి. తాజాగా చత్తీస్‌ఘడ్ హై కోర్టు ఇలాంటి విచిత్రమైన తీర్పుని వెల్లడించింది.
భార్యాభర్తల మధ్య బలవంతపు శృంగారం నేరం కాదని, అది రేప్ కిందకి రాదని చత్తీస్‌ఘడ్ కోర్టు తాజాగా ఓ తీర్పులో పేర్కొంది. అంతేకాదు.., ఇలా భార్య పెట్టిన ఓ కేసు నుండి ఓ భర్తని నిర్దోషిగా తీర్పు ఇస్తూ, కోర్టు అతనికి విముక్తి కల్పించింది. ఈ సమయంలోనే భార్య కోరికకు విరుద్ధంగా భర్త శృంగారం చేసినా.., అది తప్పు కాదని న్యాయమూర్తి చెప్పుకొచ్చారు.
ఒకవేళ భార్య వయసు 18 ఏళ్ళ లోపే ఉంటే.. దీన్ని తీవ్రమైన నేరంగా పరిగణించాల్సి ఉంటుందని కోర్టు అభిప్రాయ పడింది. ఇటీవల ముంబైలోనూ ఇలాంటి కేసు విచారణకు వచ్చిన సమయంలో ముంబై అడిషనల్ సెషన్స్ జడ్జి సంజశ్రీ జే ఘారత్ కూడా ఇలాంటి తీర్పునే ఇచ్చారు. తీర్పు సమయంలో ఆ కేసును కూడా ఇవాళ చత్తీస్‌ఘడ్ కోర్టు ప్రస్తావించడం విశేషం. మరి.., ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.