ఇంటర్నేషనల్ డెస్క్- సముద్రంలో విశాలమైంది. సముద్రంలో కోట్లాది జీవులు తమ ఆవాసాన్ని ఏర్పరుచుకుని జీవిస్తుంటాయి. భూమ్మీదకంటే సముద్రంలోనే ఎక్కువ జీవులు ఉంటాయని జీవశాస్త్ర లెక్కలు చెబుతున్నాయి. ఇక సముద్రంలో దాగిన రహస్యాలెన్నో. సముద్ర లోతుల్లోకి మనిషి వెల్లగలిగినా ఇంకా ఎన్నో ప్రశ్నలను మాత్రం సమాధానం దొరకడం లేదు. సముద్రంలో ఎన్నో వింతలు విశేషాలు. ఎంత చెప్పుకున్నా తక్కువే.
సముద్రంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవ్వరు చెప్పలేరు. అట్లాంటిక్ మహాసముద్రంలో ఇలాంటి అరుదైన ఘటన జరిగింది. అట్లాంటిక్ సముద్రంలో ఓ చోట హఠాత్తుగా వలయాకారంలో మంటలు చెలరేగాయి. సముద్రానికే నిప్పంటుకుందా అని అనిపించే ఓ అరుదైన దృశ్యం అందరిని ఆశ్చర్యంలో ముంచింది. అగ్నికీలల చుట్టూ ఉన్న కొన్ని నౌకలు ఆ మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ దృశ్యాలు మెక్సికో యూకటాన్ పెనిన్సులా తీరానికి కొన్ని కిలోమీటర్ల దూరంలో ఉన్న సముద్ర ప్రాంతంలో కనిపించాయి.
సముద్రాన్ని చీల్చుకుని లావా ఎగదన్నుతున్నదా అన్నట్లుగా అనిపించింది. ఐతే ఇలా సముద్రంలోంచి మంటలు రావడానికి కారణం నీటి అడుగున ఉన్న పైప్ లైనే అని తరువాత తెలిసింది. సముద్రం అడుగు నుంచి గ్యాస్ సరఫరా కోసం వెసిన పైప్ లైన్ లో ఎక్కడో లీక్ అవ్వడం, ఆ తరువాత అది కాస్త నిప్పంటుకోవడంతో అగ్నిజ్వాలు చెలరేగాయని మెక్సికో దేశ ప్రభుత్వ చమురు సంస్థ పెమెక్స్ తెలిపింది.
శుక్రవారం ఉదయం చెలరేగిన ఈ మంటలను దాదాపు ఆరు గంటల పాటు కష్టపడి ఆర్పేశారట. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కానీ ప్రాణనష్టం గానీ కలగలేదని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ప్రమాదకర ఘటన వెనుక కారణాలను వెలికి తీసేందుకు ఆ సంస్థ దర్యాప్తు చేపట్టింది. సముద్రంలోంచి ఎగుతన్నుతూ వస్తున్న అగ్నికీలలకు సంబందించిన వీడియో మాత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
The ocean is on fire in the Gulf of Mexico after a pipeline ruptured. Good system.
— Eoin Higgins (@EoinHiggins_) July 2, 2021