కర్నూలు జిల్లా, ఓర్వకల్లులో ఘోర అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. ఆ వివరాలు..
కర్నూలు జిల్లా, ఓర్వకల్‌లో బుధవారం మధ్యాహ్నం ప్రాంతంలో అగ్నిప్రమాదం చోటు చేసుంది. మష్రూమ్ ఫ్యాక్టరీలో చెలరేగిన మంటలు సమీపంలోని గడ్డి నిల్వలకు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఐదేళ్ల చిన్నారి మునీరా సజీవదహనం అయినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 2 వేల టన్నుల వరి గడ్డి నిల్వలు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మూడు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్నారు. మష్రూమ్ ఫ్యాక్టరీలో దాదాపు 300 నుంచి 400 మంది పనిచేస్తున్నట్లు సమాచారం. దాదాపు 5 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ విస్తరించి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి కారణాలు ఇంకా తెలియరాలేదు. దాదాపు 5 గంటలు నుంచి అగ్ని మాపక సిబ్బంది శ్రమిస్తున్న మంటలు అదుపులోకి రావట్లేదు.