ఉత్తర్ ప్రదేశ్- మొన్న తమిళనాడులో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో చీఫ్ ఆప్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ తో సహా మొత్తం 13 మంది వీర సైనికులు చనిపోయిన సంగతి తెలిసిందే. అలా చనిపోయిన జవాన్ల కుటుంబాలు ఎంతలా కన్నీరు మూన్నీరయ్యాయే మనం చూశాం. చాలా కుటుంబాలకు చనిపోయిన వీర సైనికులే పెద్ద దిక్కు. వాళ్లే కుటుంబాన్ని పోషించాల్సిన పరిస్థితి. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఆయా కుటుంబాలకు దిక్కెవరు. ఇప్పుడు ఆ కుటుంబాల పోషన బాధ్యత ఎవరిది.. అలోచిస్తేనే ఎంతో ఆందోళన కలుగుతోంది కదా.
ఇదిగో ఇక్కడ ఓ ఘటన ఇలాంటి పరిస్థితుల నుంచి వచ్చిందే. ఓ సైనికుడు దేశ సేవ కోసం ఆర్మీలో చేరి, ఉగ్రవాదుల దాడిలో వీర మరణం పొందాడు. కానీ ఇప్పుడు ఆ సైనికుడి చెల్లి పెళ్లి జరుగుతోంది. మరి అన్నయ్య లేని లోటు ఆమెకు స్పష్టంగా తెలుస్తుంది కదా. ఇక్కడ మన సైనికులు తమ ప్రేమను చాటుకున్నారు. అన్నయ్య లేని లోటును పెళ్లిలో కనిపించకుండా అంతా తామై ఆ తెల్లి పెళ్లి జరిపించారు సైనికులు.
ఉత్తర్ ప్రదేశ్‌కు చెందిన సీఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ శైలేంద్ర ప్రతాప్ సింగ్ 110వ బెటాలియన్‌లో విధులు నిర్వర్తించేవాడు. గత సంవత్సరం అక్టోబర్ లో పుల్వామాలో జరిగిన ఉగ్రవాదుల దాడిలో శైలేంద్ర వీర మరణం పొందాడు. ఈ క్రమంలో ఇటీవలే శైలేంద్ర చెల్లెలు జ్యోతి వివాహం కుదిరింది. అన్నయ్య బతికి ఉండుంటే తన పెళ్లి పనులన్నీ చూసుకునే వాడు కదా అని జ్యోతి అతన్ని గుర్తు చేసుకొని భావోద్వేగానికి గురైంది. జ్యోతి బాధను అర్థం చేసుకున్న శైలేంద్ర స్నేహితులైన సైనికులు, ఆమెకు అన్నయ్య లేని లోటు తెలియకుండా పెళ్లి జరిపించారు.
శైలేంద్రతో కలిసి పని చేసిన జవాన్లు, అతడి సోదరి పెళ్లికి సంబంధించిన కార్యక్రమాలను దగ్గరుండి చూసుకున్నారు. వధువును తమ సొంత సోదరిలా భావించి, వారే పెళ్లి మంఠపానికి తీసుకొచ్చారు. దగ్గరుండి ఘనంగా పెళ్లి జరిపించారు. సైనిక దుస్తుల్లో ఉన్న వారందరిని చూసి పెళ్లి వేడుకకు వచ్చిన వారంతా ఆశ్చర్యపోయారు. తోటి సైనికుడి కుటుంబానికి భారత జవాన్లు అండగా ఉంటున్న తీరు చూసి అథిధులంతా మనసులోనే సెల్యూట్ చేశారు.
వీర జవాను శైలేంద్ర సోదరి వివాహ వేడుకలో జవాన్లు పాల్గొన్న ఫొటోలను సీఆర్పీఎఫ్ అధికారిక ట్వీట్టర్ లో పోస్ట్ చేసింది. జీవితాంతం తోడుగా ఉండే సోదరులు, శైలేంద్ర ప్రతాప్ సింగ్ సోదరి పెళ్లి వేడుకకు జవాన్లు పెద్దన్నలుగా హాజరయ్యారు.. అని సీఆర్పీఎఫ్ ఫొటోలను జత చేసింది. ఏంటీ ఇది చదువుతోంటే మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు గుర్తుకు వస్తుంందా…
Brothers for life:
As elder brothers, CRPF personnel attended the wedding ceremony of Ct Shailendra Pratap Singh’s sister. Ct Sahilendra Pratap Singh of 110 Bn #CRPF made supreme sacrifice on 05/10/20 while valiantly retaliating terrorist attack in Pulwama.#GoneButNotForgotten pic.twitter.com/iuVNsvlsmd
— 🇮🇳CRPF🇮🇳 (@crpfindia) December 14, 2021