ఈ మధ్యకాలంలో చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంటున్నాయి. ప్రముఖ యాక్టర్స్, సింగర్స్.. చాలామంది చనిపోతున్నారు. తాజాగా మరో విషాదం నెలకొంది.
సినీ పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో చాలామంది మరణించారు. వివిధ కారణాల వల్ల చిత్ర పరిశ్రమలో ప్రముఖ యాక్టర్స్, సింగర్స్ కాలం చేశారు. వారు లేని లోటు చిత్రపరిశ్రమలో కనిపిస్తుంది. సీనియర్ రచయితలు, నటులు, నటీమణులు, సైడ్ క్యారెక్టర్స్ పోషించే ఆర్టిస్ట్‌లు, టెక్నీషియన్స్ అందరి కృషితోనే ఒక సినిమా రూపొందుతుంది. అటువంటి ప్రముఖులను సినీ పరిశ్రమ కోల్పోతుంది. తాజాగా ప్రముఖ తెలుగు రచయిత మరణవార్త వినవలసి వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
‘మిథునం’ కథా రచయిత శ్రీ రమణ కన్నుమూశారు. ఈ రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్‌లో మరణించారు. ఆయన స్వస్థలం బాపట్ల జిల్లా వేమూరు మండలం వరహాపురం. వేమూరులో ఫస్ట్‌ఫారమ్‌లో చేరారు. ఆ తర్వాత బాపట్ల ఆర్ట్స్ కాలేజీలో పీయూసీ పూర్తి చేశారు. రమణ, బాపుతో కలిసి పనిచేశారు. పేరడి రచనలతో రమణ చాలా ప్రఖ్యాతి గాంచారు. ఈయన నవ్య వారపత్రికకు ఎడిటర్‌గా కూడా పనిచేశారు. శ్రీకాలమ్, శ్రీచానెల్, చిలకల పందిరి, హాస్యజ్యోతి, మొగలిరేకులు వంలి శీర్షికలు ఆయన ద్వారా వచ్చినవి.
మిథునం మూవీలో వయసు మళ్లిన వృద్ధ జంట స్టోరీ ఆడియన్స్‌ను ఎంతగానో మెప్పించింది. వైవాహిక సంబంధానికి చెందిన విలువలు తెలుపబడినవి. ఈ సినిమాలో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, లక్ష్మీ నారాయణ్‌లు పోషించిన రెండు పాత్రలు మాత్రమే ఉంటాయి. శ్రీ రమణ బెస్ట్ సెల్లర్ తెలుగు నవలను ఆధారంగా తీసుకుని.. అదే పేరుతో దీనికి భరణి దర్శకత్వం వహించారు.