స్పెషల్ డెస్క్- ప్రేమకు హద్దులు లేవని చాల మంది చెప్పారు. కానీ ప్రేమకు సమయం, సందర్బం మాత్రం ఉండాలని మాత్రం తెలుసుకోలేకపోతున్నారు నేటి తరం యువత. అవును ప్రేమ పేరుతో విచ్చలవిడితనం బాగా పెరిగిపోతోంది. హద్దూ, అదుపు లేకుండా ప్రేమలో మునిగితేలుతున్నారు ఈరం ప్రేమికులు. ఇదిగో బీహార్ లో ఇలాంటి ప్రేమికులకు స్థానికులు వారికి తగ్గట్టు బుద్ది చెప్పారు.
సాధారనంగాఎక్కడ పడితే అక్కడ రొమాన్స్ చేసుకునే సందర్బాలను మనం సినిమాల్లోనే చూస్తుంటాం. ఇంకేముంది హీరో హీరోయిన్లు చేసినట్లుగా వెరైటీగా రొమాన్స్ చేద్దామనుకుంది ఓ ప్రేమ జంట. బైక్ పైనే ఇద్దరూ ముద్దులు, కౌగిలింతలతో చలరేగిపోయారు. బీహార్‌లోని గయా జిల్లాలోని ఓ గ్రామీణ రోడ్‌పై ఓ ప్రేమ జంట సోమవారం హల్ చల్ చేసింది. అచ్చు సినిమాల్లో హీరో హీరోయిన్ల మాదిరిగానే బైక్ నడుపుతూనే రొమాన్స్ మొదలుపెట్టారు.
ప్రియుడు బైక్ నడుపుతుండగా ప్రేయసి ట్యాంక్‌పై అతడికి ఎదురుగా కూర్చుని ఆతనికి ముద్దులు పెట్టింది. ప్రేయసి నుంచి ముద్దులు, కౌగిలింతలు పొందుతూ ప్రియుడు వేగంగా బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. రోడ్లపై ఈ ప్రేమ జంట చేస్తున్న విపరీత చేష్టలను చూసిన గ్రామస్థులు ఆగ్రహం విస్తుపోయారు. కొందరు గ్రామస్తులు ఆటోలో వారిని వెంబడించి ప్రేమ జంటను పట్టుకున్నారు. అందరూ తిరిగే రోడ్డుపై, అది కూడా బైక్ పై ఇలాంటి చెత్త పనులు చేయడమేంటని ఆ ప్రేమ జంటను ప్రశ్నించారు.
రోడ్డుపై వచ్చేవారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని నిలదీశారు. పోలీసులకు పిర్యాదు చేసేందుకు సిద్దమవ్వగా, తమ పరువు పోతుందని, ఇకపై ఇలా జరగదని వారు గ్రామస్థులకు క్షమాపణ చెప్పడంతో వారిని విడిచిపెట్టారు.