చైనాలో గొప్ప ప్రేమకథ బయట పడింది. ప్రేమికులకు కలసి బతకడమే కాదు, కలసి మరణించడము కూడా తెలుసు. ఇందుకే ప్రేమకి మరణం లేదు అంటారు. ఏ కాలంలో అయినా.. నిజమైన ప్రేమ ఇంతే స్వచ్ఛంగా ఉంటుంది. ఈ విషయాన్ని నిజం చేసే ఘటన తాజాగా ఒకటి చైనాలో బయట పడింది. తాజాగా ఆ దేశంలో ఓ ప్రైవేట్ సంస్థకి ఒక ప్రాజెక్ట్ వచ్చింది. ఇందుకోసం వారు షాంగ్జి ప్రావిన్స్‌లోని డాటాంగ్ నగరంలోని స్మశానంలో తవ్వకాలు జరిపారు. మొత్తం 600 సమాధులు. అన్నిటిని నిమిషాల వ్యవధిలో తవ్వేశారు. కానీ.., ఒక సమాధిని తవ్వగా.. అక్కడి అధికారులు, పని చేసే వారు అంతా బిత్తరపోయే దృశ్యం కనిపించింది. ఆ సమాధిలో రెండు అస్థిపంజరాలు ఉన్నాయి.
అవి ఇద్దరు ప్రేమికుల అస్థిపంజరాలు. అందులో ఉన్న మహిళ అస్థిపంజరం చూస్తే.. తన ప్రియుడిని ప్రేమతో కౌగలించుకుని అలానే చనిపోయినట్టు అర్ధం అవుతుంది. ఆమె బతికి ఉండగానే..ప్రియుడితో కలిసే సజీవ సమాధి అయినట్టు అర్ధం అవుతోంది. నిజానికి ఇవి 1500 ఏళ్ళ క్రితం నాటి అస్థిపంజరాలు. అప్పట్లో ఈ ప్రాంతాన్ని నార్తరన్ వీ రాజవంశస్తులు పరిపాలించారు. వారి పాలనలోనే ఈ జంటని సజీవ సమాధి చేసి ఉంటారని శాస్త్రవేత్తలు అనుమానిస్తున్నారు. అంటే.., గత 1500 ఏళ్ళ నుండి ఆమె తన ప్రియుడి కౌగిట్లో అలానే ఉండిపోయింది అనమాట.
ఈ అస్థిపంజరాలని జాగ్రత్తగా గమనిస్తే.. శాస్త్రవేత్తలకు సైతం చెమటలు పట్టే నిజాలు బయటపడ్డాయి. ఈ జంటలో ప్రియుడు మరణించే నాటికి అతని వయసు 30 నుండి 35 సంవత్సరాల మధ్యలో ఉండొచ్చని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. కానీ.., ఇతన్ని చాలా రకాలుగా చిత్రవధ చేసి మరీ చంపారని.., అతడి కుడి చేయి విరిచేసి, కుడి చేతి ఉంగరం వేలు కూడా లేకుండా చేసి, ఆ తరువాత పూడ్చేశారని శాస్త్రవేత్తలు తెలియచేశారు.
ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే చనిపోయిన ప్రియురాలు.. ప్రియుడు కన్నా 5 ఏళ్ళు పెద్దది అయ్యే ఛాన్స్ ఉందట. అస్థిపంజరాలను నిశితంగా పరిశీలించాకే శాస్త్రవేత్తలు ఈ విషయాలను వెల్లడించారు. అయితే.., అప్పటి పరిస్థితిలను ఎదిరించి.. ప్రేమించుకున్నందుకే వీరిని సజీవ సమాధి చేసినట్టు అర్ధం అవుతోంది. కానీ.., 1500 ఏళ్లుగా ఈ అమర ప్రేమికులు ఒకరి కౌగిలోలో మరొకరు బందీ అయిపోయారు. మరి.., దీనిని మించిన నిజమైన ప్రేమ ఉంటుందా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.