ఈటల రాజేందర్.. తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో.., ఆ మాటకొస్తే రెండు తెలుసు రాష్ట్రాలలో ఈ పేరుకి పరిచయం అవసరం లేదు. నిన్ని మొన్నటి వరకు ఈయన టి.ఆర్.ఎస్ పార్టీలో మెయిన్ లీడర్. ఉద్యమ సమయంలో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లి, తెలంగాణ ప్రజానీకాన్ని పోరుబాటలోకి తీసుకొని రావడం రాజేందర్ పాత్ర ప్రత్యేకం. ఇక టి.ఆర్.ఎస్ అధికారంలోకి వచ్చాక కూడా ఆయనకి పార్టీలో సముచిత స్థానమే దక్కింది. కానీ.., తరువాత కాలంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో కేసీఆర్-ఈటల మధ్య గ్యాప్ పెరుగుతూ వచ్చింది. తరువాత ఈటల రాజేందర్ పై భూ కబ్జా ఆరోపణలు రావడం, తరువాత ఆయన్ని మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడం, బయటకి వచ్చిన ఈటల బీజేపీ కండువా కప్పుకొవకం చకచకా జరిగిపోయాయి. కానీ.., ఈ మొత్తం వ్యవహారంలో ఈటల రాజేందర్, టి.ఆర్.ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మధ్య ఏమి జరిగిందన్న అంశం మాత్రం సమాధానం లేని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ నేపథ్యంలో సీనియర్ జర్నలిస్ట్ జాఫర్ “బ్లాక్ & వైట్ విత్ జాఫర్” పోగ్రామ్ ద్వారా ఈ ప్రశ్నలకు సమాధానాలు తీసుకుని రావడానికి ప్రయత్నించారు.
సుమన్ టీవీ ఎక్స్ క్లూజివ్ “బ్లాక్ & వైట్ విత్ జాఫర్” పోగ్రామ్ లో సీనియర్ జర్నలిస్ట్ జాఫర్.. ఈటల రాజేందర్ ని సూటిగా ఇదే ప్రశ్న అడిగారు. అసలు మీకు కేసీఆర్ కి మధ్య వచ్చిన లడాయి ఏంటి? గొడవ ఎక్కడ మొదలైంది అంటూ ప్రశ్నించారు. దీనికి.. ఈటల రాజేందర్ కూడా మొదటిసారి ఓపెన్ అయ్యి సమాధానం చెప్పారు. నాకు కేసీఆర్ కి మధ్య వ్యక్తిగత గొడవలు లేవు. ఉన్నదల్లా సైద్ధాంతిక పరమైన విబేధాలు మాత్రమే. తెలంగాణ సమాజంలో జనాలకు రేషన్ సరిగ్గా అందడం లేదు. పెన్షన్ ఇవ్వక 5 ఏళ్లు అవుతుంది. ఆయన ఏమో ప్రజలకి, ఎమ్మెల్యేలకి, మంత్రులకి అందుబాటులో ఉండరు. నియోజకవర్గాల్లో నాయకులు తిరగలేని పరిస్థితిలు ఏర్పడ్డాయి. ఇలాంటి సమయంలో కూడా ఆత్మభిమానం చంపుకుని మౌనంగా ఎలా కూర్చోవాలి? అందుకే.. ఒకటి, రెండు సందర్భాల్లో నా వాయిస్ వినిపించా. ఇక్కడే మా మధ్య లడాయి మొదలైందని ఈటల సూటిగా సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మీరు కూడా ఫుల్ ఇంటర్వ్యూ చూసి.., దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.