తేనెటీగలు ఇష్టమైన కీటకాలు కాకపోవచ్చు. ఎందుకంటే అవి కుడితే నిజంగా బాధేస్తుంది. అయితే పర పరాగ సంపర్కం జరిపే ముఖ్యమైన కీటక జాతుల్లో తేనెటీగలు అగ్రస్థానంలో ఉన్నాయి. ప్రపంచ జనాభాకు కావల్సిన ఆహారంలో అధికశాతం ఈ తేనెటీగల పరాగ సంపర్కం ములానే లభిస్తుంది. . కానీ నేడు రికార్డ్ స్థాయిలో ఈ తేనెటీగలు చనిపోతున్నాయి. ఒకవేళ ఈ తేనెటీగలే లేకపోతే, మన ప్రపంచ ఆహార సరఫరా పరిస్థితి ఏమైపోతుంది? రేపు ఒకవేళ సడన్ గా ఈ భూమిపై ఉన్న తేనెటీగలనీ చనిపోతే పరిస్తితులేం బావుండవు. సమతుల్య ఆహారం కోసం, మానవులకు అవసరమైన పండ్లు, ఇతర కూరగాయలు, మొక్కల పునరుత్పత్తి చేయడానికి, వాటిని పెంచడానికి ఈ పరాగ సంపర్కం అవసరం. ఈ సంపర్కాన్ని తేనెటీగలు బెస్ట్ అని చెప్పవచ్చు. కొన్ని మిలియన్ సంవత్సరాల నుండి పుష్పించే మొక్కలతో కలిసి ఉండటం వల్ల ఇవి పరాగ సంపర్క యంత్రాలుగా
మారిపోయాయి. మనం తినే 84శాతం పంటలను పరాగ సంపర్కం చేయడానికి తేనెటీగలు సహాయపడుతున్నాయి. తేనెటీగలతో స్నేహంగా కూడా ఉండొచ్చు అని నిరూపిస్తోందీ మహిళ. టెక్సాస్‌కు చెందిన ఎరికా థాంప్సన్ అనే మహిళ మాత్రం అలా కాదు. తేనెటీగల పెంపకం దారి అయినా ఈమె తేనె తుట్టెను పద్ధతిగా ఏ భయం లేకుండా చేతులతో తీస్తుంది.
కొద్దిరోజుల క్రితం టెక్సాస్‌లోని ఓ ఇంటిలో రెండు సంవత్సరాలుగా దాగి ఉన్న తేనె తుట్టెను చేత్తో తీసివేసింది.ఎవరూ ఊహించని విధంగా ఎరికా ఎలాంటి సేఫ్టీ లేకుండా తేనెటీగలను తుట్టెనుంచి వేరు చేయడం ఒకరు వీడియో తీసారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోను ఇప్పటివరకు సుమారు 1.5 మిలియన్ల మంది వీక్షించారు. వీడియో చూసిన వారు ఔరా..! అంటున్నారు. అంతేకాకుండా మహిళను వండర్‌వుమన్ అంటూ తెగ కామెంట్లు చేస్తున్నారు.