హైదరాబాద్- ఆ కాలంలో మహిళలు, ఆడపిల్లలు స్వేఛ్చగా బయట తిరగాలంటే ఇబ్బందిగానే ఉంది. ఇక ఎక్కడైనా పనిచేయంలే వారు అనే సమస్యలు ఎదుర్కొంటున్నారు. అందులో ప్రధానంగా లైంగిక వేధింపులకు ఎక్కుగా గురవుతున్నారు. చాలా మంది వేధింపులను ఎదుర్కొంటున్నా.. కొంత మంది మహిళలు మాత్రమే బయటపడుతున్నారు. చాలా మంది బయటకు చెప్పుకోలేక కుమిలిపోతున్నారు.
ఇదిగో ఇక్కడ హైదరాబాద్ లో ఓ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్న ఓ యువతిని ఆ ఇంటి యజమాని లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటన ఆలస్యంగా వేలుగులోకి వచ్చింది. ఆ యువకున్ని పోలీసులు అరెస్ట్ చేశారు. లక్ష్మి అనే మహిళ ఫ్యామిలీ పొట్ట చేత పట్టుకుని మబబూబ్ నగర్ నుంచి చాంద్రాయణగుట్టకు వచ్చి అక్కడే నివాసం ఉంటోంది. ఆర్థిక అవసరాల నిమిత్తం తన 19 ఏళ్ల కూతురిని స్థానికంగా ఉండే బస్తీలో ఉన్న ఓ ఇంట్లో పనికి కుదిర్చింది.
ఇంకేముంది ఇంటి యజమాని కొడుకు కన్ను ఆ యువతిపై పడింది. 23 ఏళ్ల ఆ యువకుడు ప్రేమ పేరుతో ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఇంట్లో ఎవరు లేని సమయంలో ఆమెతో అసభ్యంగా ప్రవర్తిస్తూ, తన కోరిక తీర్చాలంటూ వెంటపడ్డాడు. అంతే కాదు ఆ యువతి ఇంట్లో పని పనిచేస్తున్న సమయంలో రహస్యంగా ఫోటోలు తీసి ఆ ఆమె వాట్సాప్ నెంబర్ కు పంపి, అసభ్యపదజాలంతో మెస్సేజ్ లు పెట్టడంతో ఆ యువతి పని మానేసింది.
ఆమె పని మానేసినా ఆ యువకుడు వెంటపడటం మానలేదు. ఆ యువతికి ఫోన్ చేస్తూ, అసభ్యకరమైన ఫోటోలు పంపుతుండటంతో ఇఖ చేసేది లేక తన తల్లికి విషయం చెప్పింది. ఆమె తల్లి వెంటనే చంద్రాయన్ గుట్ట పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు చాంద్రాయణగుట్ట పోలీసులు కేసును నమోదు చేసి ఆదివారం ఆ యువకున్ని అరెస్ట్ చేశారు.