కరోనా మహమ్మారి మానవాళిని వణికిస్తోంది. ఈ చైనా వైరస్ ఆటకట్టించాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే మార్గమని ప్రపంచదేశాలు అన్నీ నమ్ముతున్నాయి. దీంతో.., యుద్ధ ప్రాతిపదికన ప్రజలకి వ్యాక్సిన్స్ అందిస్తున్నాయి. వ్యాక్సిన్స్ వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. శరీరంలో యాంటీ బాడీలు ఉత్పత్తి అవుతాయి. వ్యాక్సిన్ గురించి అందరికీ తెలిసింది ఇంత వరకే. కానీ.. ఇక్కడ ఓ అన్న, చెల్లికి మాత్రం టీకా వేసుకున్నాక ఒంట్లో కరెంటు పుట్టింది. శరీరం బుల్లి విద్యుత్ కేంద్రంగా మారిపోయింది. మరి.. ఈ వింత ఎలా సాధ్యం అయ్యిందో ఇప్పుడు తెలుసుకుందాం. హుబ్లీకి చెందిన సుమంత్, దీక్ష అన్న చెల్లెళ్లు. తాజాగా.., వీరిద్దరూ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత రోజు సుమంత్ ఓ ఎల్ఈడీ బల్బుతో ఏవేవో ప్రయోగాలు చేశాడు. ఆ సమయంలో అతనికి వ్యాక్సిన్ వేసిన చోట బల్బు పెట్టగానే అది వెలిగిపోయింది. దానిని చూసి సుమంత్తో పాటు కుటుంబ సభ్యులు కూడా షాక్ తిన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న ప్రదేశంలో తప్ప శరీరంలోని ఇతర భాగాలపై ఎక్కడ పెట్టినా బల్బు వెలగడం లేదు. సరిగ్గా సూది గుచ్చిన చోట పెడితే 9వాట్స్ బల్బు వెలగడం అందరికీ షాక్ కలిగించింది. ఇక తరువాత దీక్షకి కూడా ఇదే అనుభవం ఎదురైంది.
వీరిద్దరు శరీరం నుండి విద్యుత్ వస్తు.., బల్బు వెలుగుతున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ వింతను చూసేందుకు చుట్టుపక్కల ప్రజలు తరలి వస్తున్నారు. మా కోసం ఒక్కసారి బల్బు వెలిగించవా.. అని అడుగుతున్నారు. కానీ.., నెటిజన్స్ మాత్రం దీన్ని కొట్టిపారేస్తున్నారు. ఇది వింత కాదు పబ్లిసిటీ స్టంట్ అని సెటైర్లు వేస్తున్నారు. అది రిమోట్తో ఆపరేట్ చేయగలిగే చార్జింగ్ బల్బు అయి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే కరోనా టీకాకు, కరెంటుకు సంబంధమేంటని ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఇప్పటి వరకు ఈ విషయంలో స్పందించకపోవడం విశేషం. మరో వైపు ఢిల్లీకి చెందిన రాజేష్ అనే వ్యక్తి తాను టీకా రెండో డోసు తీసుకున్న తరువాత శరీరం అయస్కాంతంలా అయిపోయిందని, ఇప్పుడు తన శరీరం ఇనుముని ఆకర్షిస్తోంది అంటూ ఒక వీడియోని బయటపెట్టాడు. దీంతో.., అధికారులు ఈ రెండు సంఘటనలపై స్పందించి.., ప్రజల్లో ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని ప్రజలు కోరుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.