దేశంలో ప్రస్తుతం వంటనూనె ధరలు చూస్తే భయపడే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే. అయితే.. తాజాగా వంటనూనె ధరలు మెల్లగా దిగివస్తున్నట్లే అనిపిస్తుంది. ఓ విధంగా ఈ వార్త మహిళలకు శుభవార్త అనే చెప్పాలి. ప్రముఖ ఆయిల్ కంపెనీలు వినియోగదారులకు ఊరటనిచ్చే నిర్ణయం తీసుకున్నాయి.
మొన్నటిదాకా ఆకాశానికి ఎగబాకిన వంటనూనె ధరలు (Edible Oil Prices) మెల్లగా తగ్గుముఖం పడుతున్నాయి. ఓ దశలో కిలో వంటనూనె 180 రూపాయలకు చేరిన విషయం విదితమే. తర్వాత క్రమంగా తగ్గి 145 -150 రూపాయలకు చేరింది. తాజాగా మరోసారి ఎడిబుల్ ఆయిల్ కంపెనీలు తీపికబురు వినిపించాయి. ధరలు తగ్గిస్తూ.. MRP రేట్స్ పై 10-15 శాతం మేరా తగ్గిస్తున్నట్లు ప్రకటించాయి. ఫార్చ్యూన్, రుచి సోయా, మహాకోష్, సన్‌రిచ్, రుచి గోల్డ్, న్యూట్రెల్లా, ఇమామి, బంగే, ఫ్రీడమ్ ఆయిల్స్ ఉత్పత్తి చేసే అదానీ విల్మార్, ఇమామి, జెమినీ సంస్థలు ఈ నిర్ణయం తీసుకున్నాయి. అంటే దాదాపు ప్రతి ఆయిల్ బ్రాండ్ ధర కిలోకు 20 – 25 రూపాయల వరకూ తగ్గనుంది.వీటితో పాటు న్యూట్రిలివ్ బ్రాండ్స్, సన్నీ బ్రాండ్స్, గోకుల్ ఆగ్రో, విటా లైఫ్, మెహక్, జైకా బ్రాండ్స్ ధరలు కూడా MRP పై 10-15 శాతం (Edible Oil Companies MRP Reduced) తగ్గనున్నాయి. రానున్న ఫెస్టివల్ సీజన్ దృష్టిలో పెట్టుకొని ఆయిల్ కంపెనీలు తమ MRP ని తగ్గించేందుకు ముందుకొచ్చాయి. ఈ విషయం తెలిసి దేశవ్యాప్తంగా జనాలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆయిల్ ధరలు తగ్గడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.