జైలులో అనగానే మనకు వెంటనే గుర్తుకు వచ్చేది.. కట్టుదిట్టైన భద్రత, నిరంతరం పోలీసులు పహరా,ఖైదీలు, సీసీటీవీ ఫుటేజీలో పర్యవేక్షణలో సిబ్బంది. కానీ ఓ ప్రాంతంలోని జైళ్లు మాత్రం దీనికి పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఖైదీలను ఉంచే గదులు ఫైస్టార్ హోటల్ లోని గదులను తలపిస్తాయి. ఈ వైరటీ జైళ్లు మనకు యూకే లో దర్శనం ఇస్తుంది. ప్రస్తుతం ఈ జైలు వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
యూకే లోని ఒక జైలులో ఇలాంటి ఈకోఫ్రెండ్లీ జైలును ఏర్పాటు చేశారు. యూకే లోని నార్తంప్టన్ షైర్ లో హెచ్ఎంపీ వెల్స్ లో జైలు ఉంది. అది మాములుగా ఉండే జైళ్లకు పూర్తిగా విభిన్నంగా ఉంటుంది. అది ఫైవ్ స్టార్ హోటల్ మాదిరిగా ఉంటుంది. దాని లోపల ఇనుక చువ్వలు ఉండవు. గదిలో విలాస వంతంగా కిటికీలు ఉంటాయి. అందులోని ఖైదీలు పారిపోవడానికి ప్రయత్నించరు. వారికి శునకాలతో ఆడుకోనేందుకు అవకాశం కూడా కల్పిస్తారు. మానసికంగా బాధపడేవారు శునకాలతో ఆడుకుంటే.. ఒత్తిడి నుంచి బయటపడతారని పలు అధ్యయనాలలో వెల్లడైంది.యూకేలో ఉన్న ఈకోఫ్రెండ్లీ జైలు గత నెలలోని ప్రారంభమైంది. గతంలో కేవలం ఒక్కవ్యక్తి మాత్రమే ఉన్న ఈ జైలులో ఖైదీల సంఖ్య 137 కి చేరింది. అదే విధంగా ఖైదీలకు వినోద కార్యక్రమాలకు అవకాశం ఉంటుంది.
ఖైదీలకు, వారి కుటుంబంలోని పిల్లలతో ఆడుకొవడానికి అవకాశం కూడా కల్పిస్తారు. ప్రస్తుతం యూకెలో ఇలాంటి జైళ్లు నాలుగు ఉన్నాయి. వీటిలో 1700 మంది ఖైదీలు, 700 మంది పోలీసు సిబ్బంది ఉన్నారు. ఖైదీలకు తమ వారితో వీడియో కాల్స్ మాట్లాడుకునే అవకాశం కూడా కల్పించారు. అయితే, ఖైదీలలో మార్పులు రావడానికి, తిరిగా వారుసమాజంలో తిరిగి మాములు మనుషుల మాదిరిగా వెళ్లడానికి ఇలాంటి పనులు చేపట్టామని డైరెక్టర్ జాన్ మెక్ లాఫ్లిన్ తెలిపారు. ప్రస్తుతం ఈకోఫ్రెండ్లీ జైలు ఇది సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. మరి.. ఈ వెరైటీ జైలుపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.