గతంలో ఎక్కడో ఓ చోట పూట కూళ్ల ఇల్లు ఉండేది. అందులో కొంత డబ్బులిచ్చి తినిపోయావారు స్థానికులు, వేరే ఊరి నుండి వచ్చిన వారు. అవే రూపాంతరం చెంది హోటళ్లుగా మారిపోయాయి. ఇప్పుడు నగరంలోనే కాదూ పల్లెల్లోకి కూడా హోటల్స్ వచ్చేశాయి
గతంలో ఎక్కడో ఓ చోట పూట కూళ్ల ఇల్లు ఉండేది. అందులో కొంత డబ్బులిచ్చి తినిపోయావారు స్థానికులు, వేరే ఊరి నుండి వచ్చిన వారు. అవే రూపాంతరం చెంది హోటళ్లుగా మారిపోయాయి. ఇప్పుడు నగరంలోనే కాదూ పల్లెల్లోకి కూడా హోటల్స్ వచ్చేశాయి. స్విగ్గీ, జొమాటో వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ వల్ల ఒక్క క్లిక్‍తో ఇంటికే వేడి వేడి ఆహార పదార్థాలు వచ్చి చేరుతున్నాయి. దీంతో ఇక ఇళ్లల్లో పొయ్యి వెలిగించే సంఖ్య తగ్గిపోతుంది. అయితే హోటల్స్‌కే కస్టమర్లను రాబట్టేందుకు జిమ్మక్కులు చేస్తున్నాయి రెస్టారెంట్లు. ఒక్క రూపాయికే బిర్యానీతో పాటు వీకెండ్స్‌లో ఆఫర్స్ తో ఆకర్షిస్తున్నాయి. మండి, థాలీ అంటూ రకరకాల పేర్లు పెట్టి కస్టమర్లను తమవైపు తిప్పుకుంటాయి. వీటితో పాటు ఇప్పుడొక కొత్త టెక్నిక్ లను అనుసరిస్తున్నాయి.
అదేంటంటే.. కస్టమర్లకు పోటీ పెట్టడం. ఇటీవల కాలంలో సరికొత్త ప్రయోగాన్ని చేస్తున్నాయి హోటల్స్. ఆ మధ్య కాలంలో బాహుబలి భోజనం అంటూ ..పెద్ద ప్లేటు నిండా చాలా రకాల వంటలు పెట్టి.. అవి తింటే లక్ష రూపాయలు బహుమతిగా పొందవచ్చునని పేర్కొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు అలాంటిదే ఈ హోటల్ కూడా అనుసరిస్తుంది. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్ కౌశల్ అనే హోటల్లో బాహుబలి అనే సమోసాను తయారు చేశారు. ఇది అర్థగంటలో తిని.. రూ. 71 వేలు సొంతం చేసుకోండని ఆఫర్ ప్రకటించారు. ఈ భారీ సమోసా 12 కిలోలు ఉండగా.. దీని ధర రూ. 1500లట. దీన్ని ముగ్గురు మనుషులు అరగంటలో తయారు చేశారు. ఇప్పుడు వీటిని చాలా మంది ఈ సమోసాను తీసుకెళుతున్నారట. గతంలో మూడు, ఐదు కిలోలున్న సమోసాలు తయారు చేసేవారట. ఈ జంబో సమోసాలకు డిమాండ్ రావడంతో ఇప్పుడు 12 కిలోల సమోసాను తయారు చేసి.. ఇలా డబ్బుల ఆఫర్ పెట్టారట.