హైదరాబాద్- ఈరోజు నుంచి తెలంగాణలో లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే లాక్ డౌన్ సడలింపు ఉంటుంది. ఆ తరువాత ఎక్కడికైనా వెళ్లాలంటే ఖచ్చితగా ఈ పాస్ తీసుకోవాలి. అత్యవసర పనుల నిమిత్తం వేరే రాష్ట్రాలకూ, ఇతర జిల్లాలకు వెళ్లే వారికి ఈ-పాస్ విధానం ద్వారా ప్రత్యేక పాసులు అందచేయనున్నట్లు తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లోనే అందచేసే ఈ-పాస్‌ల కోసం https://policeportal.tspolice.gov.in/ అనే వెబ్ సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని సూచించారు. అత్యవసర పరిస్థితులకు గాను లాక్ డౌన్ సడలించిన సమయంలో కాకుండా ఇతర సమయాల్లో ప్రయాణించేవారికి మాత్రమే పాసులను జారేచేస్తామని తెలిపారు.
తెలంగాణ నుంచి ఇతర రాష్ట్రలకు, రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు వెళ్లే వారికి సంబంధిత పోలీస్ కమీషనర్లు, ఎస్.పీ లు మాత్రమే పాస్ లను జారీ చేస్తారని డీజీపీ చెప్పారు. ఇక ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణకు వచ్చే వారికి మాత్రం ఆయా రాష్ట్రాల నుంటి పాస్ లు తీసుకోవాలని స్పష్టం చేశారు. మరో వైపు హైదరాబాద్ లో ఒక కమిషనరేట్ నుండి మరో కమిషనరేట్ పరిధికి ప్రయాణించే వారికి ప్రయాణం ప్రారంభమయ్యే పరిధిలోని కమీషనరేట్ నుండే పాసులు జారీ చేస్తారని డీజీపీ మహేందర్ రెడ్డి తెలిపారు. లాక్ డౌన్ సడలింపు సమయమైన ఉదయం ఆరు గంటలనుండి 10 గంటల లోపు ప్రయాణించే వారికి ఏవిధమైన పాసులు అవసరం లేదని చెప్పారు. సో.. ఈ పాస్ కావాలనుకున్న వారు https://policeportal.tspolice.gov.in/ వెబ్ సైట్ ద్వార పొందవచ్చు.