అర్ధరాత్రి ఆడది ఒంటరిగా తిరిగినప్పుడే దేశానికి నిజమైన స్వాతంత్ర్యం అని మహాత్మా గాంధీ అన్నారు. ఆయన ఏ ముహూర్తాన ఆ మాట అన్నారో గానీ స్వాతంత్ర్యం అన్న పదానికి అర్ధమే మార్చేస్తున్నారు కొంతమంది మహిళలు. మందు, సిగరెట్ తాగడం మగాళ్ళు మాత్రమేనా, ఏ మేం తాగకూడదా అన్నట్టు బిహేవ్ చేస్తున్నారు. ఏదో చెప్పుకోడానికి బాగుండే గొప్ప వాటిలో సమానత్వం కోరుకున్నా ఒక అర్ధముంది. మరీ దరిద్రంలో కూడా సమానత్వం కోరుకుంటే ఆ హౌ? ఇదే ఇప్పుడు అందరికీ పెద్ద సమస్య అయి కూర్చుంది. ఇంట్లో, హాస్టల్‌లో, బార్‌లో,పబ్‌లో ఆఖరికి రోడ్డు మీదకు కూడా వచ్చేస్తున్నారు. మందు కొట్టడం మా హక్కు అన్నట్టు తాగి రోడ్డు మీద వీరంగం సృష్టిస్తున్నారు.
తాజాగా విజయవాడకు చెందిన ఒక యువతి రోడ్డుపై మద్యం మత్తులో వీరంగం సృష్టించింది. ఎన్టీఆర్ జిల్లా విజయవాడ వన్ టౌన్ కొత్తపేట నెహ్రూ బొమ్మ సెంటర్ వద్ద తాగిన మత్తులో వాహనదారులకు ఇబ్బంది కలిగించింది. ఆమె వెంట తండ్రి కూడా ఉన్నారు. మద్యానికి బానిస అవ్వద్దు తల్లీ అని చెప్పినందుకు తండ్రిపై దాడికి దిగింది. అక్కడున్నవారు ఆపేందుకు ప్రయత్నించినా ఆమె మాత్రం రౌడీలా తండ్రిపైకి దూసుకెళ్ళింది. అక్కడితో ఆగకుండా వాహనదారులను అడ్డుపడుతూ బూతులతో రెచ్చిపోయింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన చూసిన నెటిజన్లు.. “గాంధీ తాత నువ్వు కోరుకున్న స్వాతంత్ర్యం 2.O అప్‌గ్రేడెడ్ వెర్షన్ వచ్చేసింది” అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి మద్యం తాగద్దన్న తండ్రిపై దాడి చేసిన ఈ యువతిపై మీ అభిప్రాయమేంటో కామెంట్ చేయండి.