అమెరికా (ఇంటర్నేషనల్ డెస్క్)- మాస్క్.. కోరోనా మహమ్మారి విలయ తాండవం చేస్తున్న ఈ సమయంలో మనకు శ్రీరామ రక్ష. బయటకు వెళ్తే తప్పకుండా మాస్కు ధరించాల్చిందేనని వైద్యులు గంటాపధంగా చెబుతున్నారు. అంతే కాదు మాస్కు ధరించకుండా భహిరంగ ప్రదేశాలకు వస్తే పోలీసులు జరిమానాలు కూడా విధిస్తున్నారు. దీన్ని బట్టి కరోనా కాలంలో మాస్కు ప్రాధాన్యత ఎంటో.. దాని విలువెంతో మనకు తెలుస్తోంది. ఇంతవరకు బాగానే ఉన్నా.. అసలు మాస్కు వల్ల ప్రయోజనం ఎంత.. మాస్కు కరోనా ను ఎంత వరకు ఎదుర్కోగలదు.. మాస్కు కొవిడ్ ను నిలువరించగలదా అన్న దానిపై పరిశోధకులు దృష్టి సారించారు. మాస్కులపై పలు ప్రయోగాలు చేశారు.
అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా హెల్త్ స్టడీస్ ప్రత్యేకంగా మాస్క్ పై పరిశోధనలు నిర్వహించింది. ఇందులో ఆసక్తికరమైన అంశాల వెలుగులోకి వచ్చాయి. అసలు ఒక్క మాస్కు పెట్టుకోవడం వల్ల ఏ మాత్రం ఉపయోగం లేదని ఈ పరిశోధనలో తేలిందట. కరోనా వైరస్ ను మాస్కు లో ఉండే సున్నితమైన సింగల్ పొర ఏ మాత్రం అడ్డుకోలేదని కరోలినా హెల్త్ స్టడీస్ లో తేలింది. కనీసం రెండు మాస్కులు ధరించినట్లైతేనా కరోనా వైరస్ ను అడ్డుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. కేవలం ఒక మాస్కు ధరించినట్లైతే వైరస్ సులభంగా ముక్కు లేదా నోటి ద్వార ప్రవేశించే అవకాశం 40 శాతం ఉందట.
అదే రెండు మాస్కులు ధరించినట్లైతే వైరస్ లోపలకు ప్రవేశించే అవకాశం 0.5 శాతానికి పడిపోతుందట. అంటే రెండు మాస్కుసు ధరించడం వల్ల కరోనా సోకే ప్రమాదం దాదాపు లేనట్టేనని తెలుస్తోంది. అదే ఒక్క మాస్కు మాత్రమే ధరిస్తే కరోనా సోకే ఛాన్స్ 60 శాతం ఉన్నట్లేనని వేరే చెప్పక్కర్లేదు. అందుకని భహిరంగ ప్రదేశాలకు వెళ్లే సమయంలో ఖచ్చితంగా రెండు మాస్కులు ధరించడం మరిచిపోకండి మరి.