సాఫీగా సాగిపోతున్న జీవితంలో అనుకోని ప్రమాదం సంభవించి ఊహించని మార్పు తెస్తుంది. చాలా మంది కొన్ని కోల్పోడం వల్ల అవి లేకుండా కొత్తగా ఎలా బతకాలో అలవాటు చేసుకుంటారు. కొన్ని సార్లు ఆ అలవాటుతోనే గుర్తింపు పొందుతారు. ఉదాహరణకు ఏదైనా ప్రమాదం రెండు చేతులు పొగొట్టుకున్నవాళ్లు ఎలాగైన రాయాలనే బలమైన సంకల్పంతో కాళ్లతో రాయడం నేర్చుకుంటారు. ఆ ప్రత్యేకత వారికి గుర్తింపు తీసుకొస్తుంది. ఇలాంటిదే ఈ కుక్క జీవితంలో కూడా జరిగింది. అమెరికా కొలరాడోలోని ఔరేకి చెందిన కెంటీ పసెక్ అనే వ్యక్తి పెంపుడు కుక్క డెక్స్టర్ కారు ప్రమాదంలో ఒక కాలు పోగొట్టుకుంటుంది.
ఈ క్రమంలో ఆ కుక్కకి ప్రమాదం జరిగిన సంవత్సరంలోనే ఆ కాలు నిమిత్తం సుమారు ఐదు సర్జరీలు కూడా జరిగాయి. అంతేకాదు కాలు పోయిన తర్వాత కుక్క తన మూడు కాళ్లతో నడవడం ప్రారంభించింది. అచ్చం మనిషిలాగే నడుస్తుంది. అయితే ఆ కుక్క యజమాని దీనికి సంబంధించిన వీడియోతోపాటు “కుక్క వాస్తవాన్ని అంగీకరిస్తూ జీవించడానికీ ప్రయతిస్తోంది” అనే క్యాప్షన్ జోడించి మరీ ట్వీట్ చేశాడు. దీంతో నెట్టింట ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ మేరకు నెటిజన్లు డెక్స్టర్‌ని ప్రశంసిస్తూ రకరకాలుగా ట్వీట్ చేశారు.