కత్తి మహేశ్.. ఎప్పుడు వివాదాలతో స్నేహం చేసి.., అనుకోని రీతిలో తిరిగి రాని లోకాలకి వెళ్ళిపోయిన ఓ ఫిలిం క్రిటిక్ . జూన్ 26 తెల్లవారుజామున కారు ప్రమాదం జరగడం, కత్తికి తీవ్ర గాయాలు కావడం అందరికీ తెలిసిందే. అయితే.., రెండు ఆపరేషన్స్ విజయవంతం అయ్యాక, ప్రభుత్వం కూడా అతనికి వైద్య ఖర్చులకి భారీగా సహాయం చేసిన తరువాత.., కత్తి మహేశ్ అనుకోని విధంగా ప్రాణాలను కోల్పోవడం అందరికీ షాక్ ఇచ్చింది.
ప్రపంచలో అన్నీ విషయాలపై ఓపెన్ గా మాట్లాడే కత్తి మహేశ్.. తన వ్యక్తిగత విషయాలను మాత్రం ఎప్పుడు గోప్యంగా ఉంచుతూ వచ్చాడు. ఒకానొక సమయంలో తన తల్లి పేరు చెప్పడానికి కూడా ఇష్టపడకుండా ఆయన అవమానకర రీతిలో స్టూడియో నుండి బయటకి వెళ్లిపోయారు. ఇక చాలా మందికి కత్తి మహేశ్ దంపతులు అప్పట్లో విడాకులు తీసుకున్నారని తెలుసు. కానీ.., ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట విడాకుల వరకు ఎందుకు వెళ్ళింది? అసలు వీరి మధ్య ఏమి జరిగింది అన్నది చాలా మందికి తెలియదు.
కత్తి మహేశ్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నత విద్యను అభ్యసించిన విషయం తెలిసిందే. ఆ సమయంలోనే బెంగాలీ అమ్మాయి సోనాలితో సోషల్ మీడియాలో పరిచయం అయ్యింది. తరువాత వీరిద్దరూ తరుచుగా కలుసుకుంటూ.., ఆ ప్రాసెస్ లో ప్రేమలో పడ్డారు. కొన్ని రోజుల తర్వాత వీరు మతాంతర వివాహం చేసుకున్నారు. వారికి ఒక కుమారుడు కూడా జన్మించాడు. సోనాలి ప్రభుత్వ ఉద్యోగి. కానీ.., కత్తి మహేశ్ కి పెద్దగా సంపాదన ఉండేది కాదు.
ఆ సమయంలో కత్తి ఇండస్ట్రీలో అవకాశాల కోసం కష్టపడుతూ ఉన్నాడు. పెద్దగా సక్సెస్ కాని సమయం. ఆలా ఇంట్లో బాధ్యతలు పట్టించుకోకపోవడంతో కత్తి మహేశ్, అతని భార్య విడాకులు తీసుకున్నారు. అయితే.., వీరు వివాహ బంధానికి ఫుల్ స్టాప్ పెట్టినా మంచి స్నేహితులుగా మాత్రం కొనసాగుతూ వచ్చారు. సోనాలి భోపాల్ లో సెటిల్ కావడంతో.., కత్తి మహేశ్ తనకి వీలు చిక్కిన ప్రతిసారి అక్కడికి వెళ్లే తన కొడుకుని కలుసుకునేవారు. బిగ్ బాస్ తొలి సీజన్ పూణేలో జరగగా ఆ షోలో పాల్గొన్న కత్తి మహేశ్ త్వరగానే బయటకి వచ్చేశాడు. ఆ తర్వాత బోపాల్‌లోని తన భార్య, పిల్లల దగ్గరకు వెళ్లిన కత్తి మహేశ్ కొన్ని రోజులు అక్కడే ఉన్నాడు. ఇలా.., కత్తి మహేష్, అతని భార్య పరిస్థితిల కారణంగా విడిపోయినా చివరి వరకు మంచి స్నేహితులుగా తమ బంధాన్ని కొనసాగించారు.