పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్లుగా థియేటరల్లో సందడి చేస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ ఇది. కోలీవుడ్ సినిమాకు దర్శకత్వం అందించిన సముద్ర ఖనియే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్ మల్టీ స్టారర్లుగా థియేటరల్లో సందడి చేస్తున్న సినిమా ‘బ్రో’. తమిళ సినిమా వినోదయ సీతంకు రీమేక్ ఇది. కోలీవుడ్ సినిమాకు దర్శకత్వం అందించిన సముద్ర ఖనియే ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. మాటల మాంత్రికుడు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇక్కడి నెటివిటీకి తగ్గట్లుగా కథలో మార్పులు, చేర్పులు చేశారు. 21 రోజుల్లోనే పవన్ క్యారెక్టర్ ను పూర్తి చేశాడు దర్శకుడు. ఈనెల 28న విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. టైమ్, సెంటిమెంట్ చుట్టూ కథను అల్లుకుని సినిమాను చిత్రీకరించారు. ఈ చిత్రంలో ప్రతి ఒక్కరూ తమకు ఇచ్చిన పాత్ర పరిధి మేర నటించారు. ఎమోషనల్ టచ్ ఉన్న ఈ సినిమాలో చెల్లెలి సెంటిమెంట్ చాలా ఆకట్టుకుంటోంది.
ఈ సినిమాలో సాయి తేజ్ సరసన కేతిశర్మ ఆడిపాడింది. అలాగే మన హీరో మార్కండేయకు ఇద్దరు చెల్లెల్లు, ఒక తమ్ముడు ఉంటారు. ఆ చెల్లెల్లుగా కనిపించారు.. కన్నుగీటి కుర్రకారులను తన వైపు చూపుతిప్పుకున్న ప్రియా ప్రకాష్ వారియర్, యువ లక్ష్మి. ఇందులో చిన్న చెల్లెలైన యువలక్ష్మి చుట్టూ కథ తిరుగుతుంది. ఆమె అంటే గిట్టన్నట్లు కనిపిస్తాడు సాయి తేజ్. కానీ ఆ చెల్లెలంటేనే ఎక్కువ ఇష్టపడతారు మన హీరో. ఒక రకంగా చెప్పాలంటే హీరోయిన్లు కేతిక, ప్రియా ప్రకాష్ వారియర్ కన్నా ఈమె క్యారెక్టర్‌కే స్కోప్ ఎక్కువ ఉంది. అయితే ఈ చెల్లెలు క్యారెక్టర్ చేసిన యువలక్ష్మి పెద్ద యాక్టర్ అని తెలుసా..? బహుశా తెలిసి ఉండకపోవచ్చు. ఆ అమ్మాయి అనేక సినిమాలు చేసింది.
ఈ అమ్మడు చిన్నప్పటి నుండే సినిమాలు చేస్తుంది. టీవీలో చిన్న పిల్లల షో కూడా చేసింది. చైల్డ్ ఆర్టిస్టుగా అనేక సినిమాల్లో నటించింది. తమిళంలో సముద్ర ఖని, అమల్ పాల్ నటించిన అమ్మ కనక్కు అనే సినిమాలో వారి పాపగా కనిపించింది. అప్పా, కాంచన 3, వినోదయ సీతం వంటి చిత్రాల్లో మెరిసింది. మలయాళంలో కూడా ఓ సినిమాలో కూడా కనిపించింది. ఆమె చేసిన సినిమాలన్నీ సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచాయి. తమిళంలో ఎక్కువ సినిమాలు చేసిన యువ లక్ష్మి బిజియెస్ట్ నటిగా మారింది. కాగా, తెలుగులో ఆమెకు బ్రో మొదటి సినిమా. ఎక్కువగా సముద్ర ఖని సినిమాల్లో కనిపించిన ఈ అమ్మాయి.. తెలుగులో చాలా చక్కగా నటించింది. మన తెలుగు అమ్మాయే అనిపించేలా అలరించింది.