ఈ ఫోటోలో కనబడుతున్న చిన్నారి ఎవరో గుర్తుపట్టారా? దివంగత మాజీ రాష్ట్రపతి, దేశం గర్వించతగ్గ శాస్త్రవేత్త అయిన డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారితో ఒక పాఠశాల విద్యార్థిని కనిపిస్తోంది కదూ. ఈ అమ్మాయి ఇప్పుడు ఒక హీరోయిన్. కొన్ని హింట్స్ ఆధారంగా హీరోయిన్ ఎవరో కనిపెట్టండి. ఇక ఢిల్లీలో పుట్టిన ఈమె కాలేజ్ ఆఫ్ ఆర్ట్ డిగ్రీ కళాశాలలో ఫైన్ ఆర్ట్స్ లో డిగ్రీ పూర్తి చేసింది. ఆ సమయంలోనే సినిమాలపై ఆసక్తితో యాక్టింగ్ స్కూల్ లో చేరింది. అక్కడ బేరీ జాన్, మనోజ్ బాజ్ పాయ్ ల దగ్గర యాక్టింగ్ శిక్షణ తీసుకుంది. తమిళంలో విక్రమ్ ప్రభు నటించిన ఇవన్ వెరమథిరి సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టింది. మొదటి సినిమాతోనే సక్సెస్ కొట్టిన ఈమె.. ఆ తర్వాత ధనుష్ నటించిన వీఐపీ (తెలుగులో రఘువరన్ బీటెక్) సినిమాలో నటించింది.
ఆ తర్వాత తెలుగులో సందీప్ కిషన్ తో ఒక సినిమాలో నటించింది. ఇంట్లో దాచుకునే వస్తువు పేరుతో ఉంటుంది ఆ సినిమా టైటిల్. ఇంకా గుర్తుపట్టలేదా? అదేనండి బీరువా. సందీప్ కిషన్ హీరోగా వచ్చిన సినిమాలో హీరోయిన్ సురభినే ఈ ఫోటోలో ఉన్న చిన్నారి. తెలుగులో మొదటి సినిమాతో సూపర్ హిట్ అందుకున్న సురభి.. ఆ తర్వాత శర్వానంద్ సరసన ఎక్స్ ప్రెస్ రాజా, నాని సరసన జెంటిల్ మేన్ సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు కూడా కమర్షియల్ సక్సెస్ అందుకున్నాయి. ఆ తర్వాత ఒక్క క్షణం, శశి సినిమాల్లో నటించింది. తెలుగులో అవకాశాలు లేక సినిమాలకు దూరమైంది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. అభిమానులతో రెగ్యులర్ గా టచ్ లో ఉంటుంది. ఎప్పటికప్పుడు ఫోటోలు, వీడియోలు పెడుతూ ఫ్యాన్స్ కి మంచి ట్రీట్ ఇస్తుంటుంది. అయితే ఈమె తన బాల్యంలో అబ్దుల్ కలాంతో దిగిన ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.