ఫిల్మ్ డెస్క్- అల్లు అర్జున్ సతీమణి అల్లు స్నేహారెడ్డి సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ అని అందరికి తెలుసు. అల్లు అర్జున్ సినిమా విషయాల నుంచి మొదలు తమ ఫ్యామిలీకి సంబందించిన అన్ని విషయాలను ఎప్పిటికప్పుడు స్నేహా రెడ్డి అభిమానులతో పంచుకుంటారు. ప్రధానంగా తమ పిల్లలకు చెందిన ప్రతి అంశాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటుంది స్నేహారెడ్డి.
ఇక ఇప్పుడు అల్లు అర్జున్ ఇంట్లో రెండు దెయ్యాలు హల్చల్ చేస్తున్నాయట. ఈ విషయాన్ని స్వయంగా అల్లు స్నేహా రెడ్డి చెప్పింది. అంతే కాదు ఈ రెండు దెయ్యాలను వీడియో తీసి మరీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది స్నేహా రెడ్డి. ఐతే ఈ రెండు దెయ్యాలు మరేమో కాదు.. అల్లు అర్జున్ కొడుకు అర్జున్ పిల్లలు అర్హ, అయాన్. తెల్లటి బట్టతో ముసుగు వేసుకొని ఆ ఇద్దరూ ఇల్లంతా తిరుగుతూసందడి చేశారట.
కళ్లద్దాలు పెట్టుకొని క్యూట్ డ్యాన్స్ చేస్తూ ఇంట్లో అందరిని కాసేపు భయపెట్టారు. వారి అల్లరిని వీడియో తీసిన స్నేహ రెడ్డి, దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ.. నా చిన్ని దెయ్యాలు అంటూ క్యాప్సన్ పెట్టింది. ఇంకేముందు ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అల్లు అర్జున్ అభిమానులు ఈ వీడియోను బాగా లైక్ చేస్తున్నారు.
అన్నట్లు అల్లు అర్జున్బ ముద్దుల కూతురు అల్లు అర్హ త్వరలోనే సినీ అరంగేట్రం చేయబోతోంది. సమంత నటిస్తున్న శాకుంతలం సినిమాలో అర్హను నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప మూవీలో నటిస్తున్నారు.