వెస్టిండీస్‌తో అహ్మాదాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా 2-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఇక శనివారం మూడో వన్డే జరగనుంది. కాగా రెండో వన్డే సందర్భంగా టీమిండియా యువ ఆటగాడు దీపక్‌హుడా టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మను అవైడ్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మ్యాచ్ సందర్భంగా రోహిత్ దీపక్ దగ్గరికి వచ్చిఅభినందించేందుకు చేయిచాస్తే.. దీపక్ మాత్రం రోహిత్‌ను పట్టించుకోకుండా.. పక్కకు వెళ్లిపోయాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీనిపై మాత్రం రోహిత్ ఫ్యాన్స్ ఫుల్ కోపంగా ఉన్నారు. సోషల్ మీడియాలో దీపక్ హుడాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలి వన్డేతో వన్డేల్లోకి అరంగేట్రం చేసిన దీపక్ రెండో వన్డేలోనే కెప్టెన్‌తో ఈ విధంగా ప్రవర్తించడం సరైన పద్ధతి కాదని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇది దీపక్ కావాలని చేసిందా.. అనుకోకుండా పొరపాటున జరిగిందా అనే విషయంలో మరింత స్పష్టత రావాల్సి ఉంది. మరి ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.