ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ గా పరిచయమైన వాట్సప్ రాను.. రాను.. ఎన్నో సేవలను అందుబాటులోకి తెచ్చింది. బ్యాంకింగ్ సర్వీస్ మొదలుకొని షాపింగ్ వరకు అన్ని రకాల సేవలను వాట్సప్‌లో పొందొచ్చు. బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు, ఒక ఖాతా నుంచి వేరొక ఖాతాకు అమౌంట్ ట్రాన్సఫర్ చేయొచ్చు, గ్రాసరీ ఆర్డర్ చేయొచ్చు, సిబిల్ స్కోర్ చెక్ చేయొచ్చు.. ఇలా అనేక రకాల సేవలు వాట్సప్‌లో అందుబాటులో ఉన్నాయి. తాజాగా, వాట్సప్‌లోనే క్యాబ్ బుక్ చేసుకునే సేవలు ప్రారంభమయ్యాయి.
యూజర్లు వాట్సప్ ద్వారానే ఉబర్ క్యాబ్ బుక్ చేసుకోవచ్చు. ఈ సర్వీసులు అందించడానికి ఉబర్ సంస్థ ఈ ఏడాది ప్రారంభంలో వాట్సాప్‌తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతానికి ఈ సేవలు ఢిల్లీ–ఎన్సీఆర్, లక్నో ప్రాంతాల్లో అందుబాటులో వచ్చాయి. మిగతా నగరాలకు త్వరలోనే విస్తరిస్తామని ఉబర్ ప్రకటించింది. వాట్సాప్ యూజర్లు కేవలం మొబైల్ నంబర్‌కు మెసేజ్ పంపడం ద్వారా ఉబర్ ట్యాక్సీని బుక్ చేసుకోవచ్చు. అంతేగాక తమ ట్రిప్ రసీదును వాట్సాప్‌లోనే పొందవచ్చు. ఇంగ్లీష్, హిందీ భాషలను ఉపయోగించి వెహికల్‌ను బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ ద్వారా క్యాబ్ సర్వీసులను బుక్ చేసుకోవడం ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం..