ఆంధ్రప్రదేశ్‌లో కర్ఫ్యూను పొడగిస్తూ రాష‌్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జూన్ 20 వరకు కర్ఫ్యూను పొడిగించింది. ప్రస్తుతం రాష్ట్రంలో కరోనా ఉధృతి తగ్గుతున్నా పూర్తిగా అదుపులోకి రాలేదు. కోవిడ్ నివారణ చర్యలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. సమీక్షకు డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని, కోవిడ్ టాస్క్‌ఫోర్స్ అధికారులు హాజరయ్యారు. ప్రస్తుతం అమల్లో ఉన్న కర్ఫ్యూ గడువు ఈ నెల 10తో ముగియడంతో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నతాధికారులతో సమీక్షించిన సీఎం వైఎస్ జగన్.. మరో పది రోజులపాటు కర్ఫ్యూ పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. కేసులు మరింత తగ్గే వరకు కర్ఫ్యూ కొనసాగించడమే మంచిదని సమావేశంలో నిర్ణయించారు. కర్ఫ్యూను ఈ నెల 20 వరకు పొడిగించిన ప్రభుత్వం సడలింపు సమయాన్ని కూడా పెంచింది.
ఇప్పటి వరకు ఉదయం ఆరు నుంచి మధ్యాహ్నం 12 వరకు ఉన్న సడలింపు సమయం.. ఈ నెల 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 10వ తేదీ వరకు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 11 తేదీ నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు వివిధ వ్యాపార, వాణిజ్య సంస్థలు, దుకాణాలు, కార్యాలయాలు, రెస్టారెంట్లను అనుమతించనున్నారు.