అదృష్టం అంటే ఆమెదే. అదృష్టం అంటే కొంతమందికి చాలా నమ్మకం. కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. వారు కలలో కూడా ఊహించని పనులు వారి ప్రమేయం లేకుండానే జరిగిపోతాయి. అలాంటప్పుడు వీడు నక్కను తొక్కాడురా అంటుంటారు. అంటే నక్క అదృష్ట దేవతా ? తెలియదు. కొన్నిసార్లు పరధ్యానంగా చేసినా సరే సూపర్ రిజల్ట్ వెతుక్కుంటూ ఇంటికి వచ్చేస్తుంది. అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రం కేన్సస్కు చెందిన 51 ఏళ్ల ఏంజెలా కార్వేలాకు అలానే జరిగింది. ఆమె అనుకున్న షెడ్యూల్ ప్రకారం ఫ్లోరిడాలో విమానం ఎక్కాల్సి ఉంది. ఇంతలో ఫ్లైట్ క్యాన్సిల్ చేస్తున్నట్లు సిబ్బంది అనౌన్స్ చేశారు. అయితే ప్రైజ్‌మనీగా ఒక మిలియన్ డాలర్లు – సుమారు రూ.7.5కోట్లు గెలుచుకుంది. అదెలాగంటే…
దీంతో చేసేదేమీ లేక బయటకు వచ్చిన కార్వేలా దగ్గర్లో ఉన్న ఓ సూపర్మార్కెట్లో 30 డాలర్లు పెట్టి లాటరీ టికెట్ కొనుగోలు చేసింది. అంతే.. ఇక్కడితో ఆమె దశ తిరిగింది. ద ఫాస్టెస్ట్ రోడ్ అనే సంస్థ నిర్వహించిన ఈ లాటరీలో కార్వేలా విన్నర్‌గా నిలిచింది. ఊహించని విధంగా దక్కిన ఈ లాటరీ టికెట్ గెలుపుతో కార్వేలా ఫుల్ హ్యపీ అయిపోయింది. తనకు విమానం రద్దు అయినప్పుడే ఏదో వింత అనుభవం ఎదురుకానుందని అనిపించిందని వెల్లడించింది.
సమయం గడపడం కోసం సరదాగా కొన్న స్క్రాచ్ ఆఫ్ టికెట్లతో కోట్లు గెలుచుకున్నానని ఆనందం వ్యక్తం చేసింది. ఈ డబ్బులో కొంత మొత్తం టాక్స్ పోగా రూ.5.8 కోట్లు కార్వేలా చేతికి అందనున్నాయి. కార్వేలాకు లాటరీ టికెట్ విక్రయించిన పబ్లిక్స్ సూపర్ మార్కెట్‌కు కూడా రూ.1.4 లక్షలు బోనస్ కమీషన్ అందనుంది. చెడు జరిగినప్పుడు దురదృష్టం అంటారు. లాటరీలు, జూదం మొదలైన అదృష్టాల్ని నమ్మేవాళ్ళని చేతకాని వారిగా కొందరు భావిస్తారు. కొన్నిసార్లు మనం ఎంత కష్టపడ్డా ఫలితాలు ఆశాజనకంగా ఉండవు.