మొసలి భూమిమీద మిలియన్ సంవత్సరాల క్రితంనుండి డైనోసార్‌ల కాలం నుండి ఉన్నాయని అంచనా. డైనోసార్‌లు 65 మిలియన్ సంవత్సరాల క్రితం అంతరించాయి. అప్పటినుండి కూడా మొసళ్ళ శరీరనిర్మాణంలో పెద్దగా మార్పులు ఏవీ వచ్చినట్లు లేదు. భూమి మీద మరెన్నో జాతులు అంతరించినప్పటికీ మొసళ్ళ జాతి నిలబడింది. ఇప్పుడిప్పుడే మొసళ్ళూ అంతరించిపోతున్నాయంటూ వచ్చే ఆందోళను తగ్గించే విధంగా తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరులోని జూపార్కులో అత్యంత అరుదైన దృశ్యం వెలుగు చూసింది. ఆ జూలోని ఓ మొసలి ఒకేసారి 14 పిల్లలకు జన్మనిచ్చింది. దాంతో ఆ జూలోని మొసళ్ల సంఖ్య అమాంతం పెరిగిపోయింది.
చెన్నై జూలో కరోనా భయం వెంటాడుతోన్నా కోయంబత్తూరు జూలో మాత్రం జీవాలు ప్రశాంతంగా ఉన్నాయి. ఈ సమయంలోనే 25 ఏళ్ల మొసలి ఏకంగా 14 పిల్లలకు తల్లి అయింది. నిజానికి అది చాలా గుడ్లు పెట్టింది. అందులో 14 పిల్లలయ్యాయి. అవి ఆడుకుంటూ ఉంటే చూసేందుకు జూ సిబ్బంది పోటీ పడుతున్నారు. కరోనా నియమాల కారణంగా సందర్శకులు వచ్చే అవకాశం లేకపోవడంతో మీడియాలో – వీడియో తెగ వైరల్ అవుతోంది.
Coimbatore zoo welcomes 14 marsh crocodile hatchlings #Coimbatore #VOCZoo #Crocodiles pic.twitter.com/gQgJxg8hdl
— The News Minute (@thenewsminute) June 20, 2021