అమరావతి- కత్తి మహేశ్.. వివాదాలకు కేంద్ర బిందువు. నటుడు, సినీ విశ్లేషకుడు ఐన కత్తి మహేశ్ చాలా అంశాల్లో వివాదాస్పద కామెంట్స్ చేశాడు. ఇక మొన్న నెల్లూరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్ తీవ్ర గాయాల పాలై చెన్నై అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ నేపధ్యంలో కత్తి మహేష్ ఆస్పత్రి చికిత్స కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17 లక్షల రూపాయలను విడుదల చేసింది. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఈ నగదును మంజూరు చేస్తూ, అధికారికంగా సిఎం క్యాంప్ ఆఫీస్ నుంచి లేఖ విడుదల చేశారు అధికారులు.
ఇంత వరకు బాగానే ఉన్నా కత్తి మహేష్‌కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 17లక్షల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించడంపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అసలు కత్తి మహేష్‌కి ఏ ప్రాతిపదికన అంత భారీ మొత్తంలో ఆర్థిక సాయం చేస్తున్నారని జనం ప్రశ్నిస్తున్నారు. సామాన్యులకు ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు కూడా ఇలాగే స్పందిస్తున్నారా అని నిలదీస్తున్నారు. కత్తి మహేష్ విషయంలో ఇలా ప్రత్యేక శ్రద్ద తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తు న్నారు ప్రజలు.
కత్తి మహేశ్ కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సాయం చేయాలనుకుంటే తన సొంత డబ్బులు ఇవ్వాలని, లేదంటే వైఎస్ఆర్ ట్రస్ట్ నుంచి అందించాలి తప్ప ఇలా ప్రజల డబ్బుని ఇవ్వడం ఎంతవరకు సమంజసం అని నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ సందర్బంగా గతంలో కత్తి మహేష్ హిందుమతంపై చేసిన వ్యాఖ్యలను హైలెట్ చేస్తూ ఏపీ సీఎం జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు.
మరోవైపు కత్తి మహేష్ అంటే అగ్గిమీద గుగ్గిలం అయ్యే జనసేనాని పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్రంగా స్పందిస్తున్నారు. జగన్ సర్కార్ కత్తి మహేష్ విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతూ సోషల్ మీడియాలో విమర్శలు గుప్పిస్తున్నారు. మరి ఈ అంశాన్ని వైసీపీ ప్రభుత్వం ఏ మేరకు సీరియస్ గా తీసుకుంటుంది, అసలు దీనిపై స్పందిస్తుందా అన్నదే ఇప్పుడు సర్వత్రా ఆసక్తి రేపుతోంది.
ఎవడమ్మ మొగుడి సొమ్ము ఇచ్చార్ర
వీడేమన్నా దేశ సేవకుడా 17 లక్షలు అంట మా నెత్తిన రేట్లు పెంచేది ఇలా తగలెట్టేది తూ.
అరేయ్ సుగాలి ప్రీతి వాళ్ళ ఆర్థిక పరిస్థితి గురించి ఎప్పుడైనా పట్టించుకున్నారా రా ఎం బతుకుల రా మీవి. @YSRCParty @ysjagan— Pawan Dangeti (@jsppawan2) July 2, 2021
Desam kosam war lo participate chese gayapadinatu relief fund estunaru super govt ra babu 🤧🤧 pic.twitter.com/PPtXiW12fa
— suresh sai (@suresh0821) July 2, 2021
————