వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే తప్పు. అలాంటిది ఆ వ్యక్తితో ప్రేమ, పెళ్లి ఎక్స్ పెక్ట్ చేయడం అనేది బుద్ది లేని పని. దీని వల్ల ఆ కథలు కూడా కంచికి చేరిన ఘటనలు అనేకం ఉన్నాయి. జీవిత భాగస్వామిని కాదని, మూడో వ్యక్తితో సహజీవనం చేస్తున్న వ్యక్తులు.. వారిపై అధిపత్యం
వివాహేతర సంబంధాలు పెట్టుకోవడమే తప్పు. అలాంటిది ఆ వ్యక్తితో ప్రేమ, పెళ్లి ఎక్స్ పెక్ట్ చేయడం అనేది బుద్ది లేని పని. దీని వల్ల ఆ కథలు కూడా కంచికి చేరిన ఘటనలు అనేకం ఉన్నాయి. జీవిత భాగస్వామిని కాదని, మరొకరితో సహజీవనం చేస్తున్న వ్యక్తులు.. వారిపై అధిపత్యం చెలాయించుకోవాలనుకోవడం, తాము చెప్పినట్లే వినాలనుకోవడం మూర్ఖత్వం. ఏదైతే జీవిత భాగస్వామి విషయంలో దొరకలేదని భావించి.. పరాయి వ్యక్తుల మోజులో పడుతున్నారో.. ఆ వ్యక్తే మోసం చేస్తే మానసికంగా క్రుంగిపోయి అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. ఇదిగో నిర్మలమ్మ విషయంలో ఇదే జరిగింది. భర్తను కాదని మరొకరితో సహజీవనం చేస్తున్న ఈ మహిళ.. అనాలోచిత చర్య కారణంగా బిడ్డను అనాథను చేసింది.
ప్రియుడితో గొడవపడి.. వాగులో దూకి ఆత్మహత్యకు పాల్పడింది నిర్మలమ్మ. వికారాబాద్‌లోని షాదూ నగర్ రూరల్‌లోని ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని అయ్యవారిపల్లి శివారులో ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..కొందుర్గు మండలం ఆగిర్యాలకు చెందిన గుమ్మడి నిర్మలమ్మకు ఎల్లయ్య అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ఓ పాప. అయితే కొన్ని సంవత్సరాల క్రితం భర్తకు నిర్మలమ్మకు మధ్య గొడవలు జరగడంతో.. ఆమె దూరంగా నివసిస్తోంది. ఈ క్రమంలో 9 ఏళ్ల క్రితం తలకొండపల్లికి చెందిన రవీందర్‌తో పరిచయమై.. వివాహేతర సంబంధానికి దారి తీసింది. ఈ క్రమంలో కుటుంబంగా కలిసి జీవిస్తున్నారు. ఈ నెల 24న అయ్యవారి పల్లిలోని స్నేహితుడి ఇంటికి చెప్పకుండా వెళ్లాడు రవీందర్.
ఎంతకూ ఇంటికి రాకపోవడంతో ఫోన్ చేయగా.. స్నేహితుడు ఇంటికి వెళ్లానని చెప్పడంతో మండిపడింది. తనకేమీ చెప్పడం లేదని,తనను పట్టించుకోవడం లేదని, ఫోనులో గొడవపడుతూ తాను చనిపోతున్నానంటూ చెప్పి.. గ్రామ సమీపంలో ఉన్న వాగులోకి దూకేసింది. స్థానికులు ఆమెను కాపాండేందుకు ప్రయత్నించినా, ఇటీవల కురిసిన వర్షాలకు వాగు నీటి ప్రవాహం ఎక్కువ ఉండటంతో ఆమె కొట్టుకుపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆమె కోసం వెతికినా ఆచూకీ లభించలేదు. ఫిర్యాదు నమోదు చేసుకుని ఆమె జాడ కోసం చర్యలు చేపడుతున్నారు.