‘పారాణింకా ఆరనేలేదు.. తోరణాలు కల వాడనలేదు. పెళ్లి పందిరి తీయనే లేదు, బంధువులు ఇంటికి చేరనే లేదు. మంగళనాదాలాగనెలేదు. అప్పగింతలు అవ్వనెలేదు. గలగల పారే ఓ సెలయేరా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికే కాపురమెళ్లావా’అని గేయ రచయిత అన్నట్టుగా..
‘పారాణింకా ఆరనేలేదు.. తోరణాలు కల వాడనలేదు. పెళ్లి పందిరి తీయనే లేదు, బంధువులు ఇంటికి చేరనే లేదు. మంగళనాదాలాగనెలేదు. అప్పగింతలు అవ్వనెలేదు. గలగల పారే ఓ సెలయేరా పెళ్లి కూతురుగా ముస్తాబయ్యి శ్మశానానికే కాపురమెళ్లావా’అని గేయ రచయిత అన్నట్టుగా.. అదే జరిగింది అను విషయంలో. ఎన్నో ఆశలతో కొత్త జీవితంలో అత్తారింట అడుగుపెట్టిన ఆడ పిల్ల పట్టుమని పది రోజులు కాకుండా విగత జీవిగా మారిపోయింది. పెళ్లికి ముందు ప్రేమ, లేక అనుకున్న విధంగా భర్త చూసుకోకపోవడమో, తన ఊహించిన విధంగా కాకుండా మరో రకంగా జీవితం సాగిపోతుండటమో తెలియదు కానీ నవ వధువు ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది.
పది రోజులకే అత్తారింట్లో ఉరి కొయ్యకు వేలాడింది అను. వివరాల్లోెకి వెలితే..పళ్లిపట్టు యూనియన్ రామ సముద్రం పంచాయతీ వీజీఆర్ కండ్రిగ దళితవాడకు చెందిన రవి కుమారుడు ముత్తుకి అదే గ్రామానికి చెందిన సమీప బంధువు రాజేంద్రన్ కుమార్తె అనుతో గత నెల 29న వివాహం జరిగింది. కాగా ముత్తు జేసీబీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే అత్తారింటి కొత్త కాపురానికి వెళ్లింది అను. పది రోజుల్లో ఏం అయ్యిందో తెలియదు కానీ మంగళవారం రాత్రి తమ బెడ్ రూమ్‌లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆ సమయంలో భర్త నిద్ర పోతున్నాడు. వేకువ జామున లేచిన భర్త ముత్తు.. ఉరికి వేలాడుతున్న భార్యను చూసి వెంటనే కుటుంబ సభ్యులకు తెలిపాడు. వారు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం తిరుత్తణి ప్రభుత్వానికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.