డబ్బు కోసం అమ్మాయిలు మాన, ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. బడా బాబులకు వల వేసి.. వారిని తమ ముగ్గులోకి దింపుకుని, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ మాయ మాటలు చెప్పి కొన్ని రోజులు గడిచాక..
సోషల్ మీడియాను అడ్డుగా పెట్టుకుని యువతులు దారుణాలకు పాల్పడుతున్నారు. డబ్బు కోసం అమ్మాయిలు మాన, ప్రాణాలను కూడా లెక్క చేయడం లేదు. బడా బాబులకు వల వేసి.. వారిని తమ ముగ్గులోకి దింపుకుని, ఆ తర్వాత ప్రేమ, పెళ్లి అంటూ మాయ మాటలు చెప్పి కొన్ని రోజులు గడిచాక.. చెప్పపెట్టకుండా ఉడాయిస్తున్నారు. ఒకరిద్దర్ని కాదూ ఐదారుగుర్ని పెళ్లిళ్లు చేసుకుని మోసం చేస్తున్నారు కిలాడీ లేడీలు. చివరకు ఉన్నదంతా దోచుకుని పరారవుతున్నారు. మరో చోట మరో పేరుతో చెలామణి సాగిస్తున్నారు. వీరి ఆగడాలకు అంతు లేకుండా పోతున్నాయి. తమిళనాడులోని రషీద అనే యువతి కూడా ఇదే బాపతు. ఒకటి కాదు రెండు కాదూ.. ఏకంగా ఎనిమిది పెళ్లిళ్లు చేసుకుని, బురిడీ కొట్టించింది.
సేలం జిల్లా తారమంగళానికి చెందిన ఫైనాన్షియర్ మూర్తికి సోషల్ మీడియా యాప్ అయిన ఇన్ స్టా ద్వారా పరిచయమైంది రషీద. ఆమె బ్యూటిషన్. వీరిద్దరూ స్నేహితులయ్యారు. తర్వాత ఏకాంతంగా కలుసుకోవడం మొదలు పెట్టారు. పెళ్లి చేసుకోవాలని భావించి ఈ ఏడాది మార్చి 30న ఓమలూరు దేవాలయంలో ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. అయితే ఆమె ఓ రోజు కనిపించకుండా పోయింది. ఇంట్లో ఉన్న బంగారం, డబ్బులు కూడా కనించకపోవడంతో మూర్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పెళ్లైన మూడు నెలలు కలిసి ఉందని, ఈ నెల 5వ తేదీ నుండి కనిపించడం లేదని కంప్లైట్ చేశాడు. ఇంట్లో ఉన్న రూ. 1.5 లక్షల నగదు, 5 సవర్ల బంగారం కనిపించడం లేదంటూ పేర్కొన్నాడు.
మూర్తి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా ఆమె సోషల్ మీడియా పేజీలను వెతకడం ప్రారంభించిన పోలీసులకు కూడా దిమ్మ తిరిగే విషయాలు వెలుగుచూశాయి. రషీదకు ఇన్ స్టా, ఫేస్ బుక్ లో చాలా అకౌంట్లు ఉన్నాయని, ఒక్కో నకిలి ఖాతాకు ఒక్కో పేరు ఉన్నట్లు గుర్తించారు. అసభ్యకరమైన చాటింగ్‌లు చేస్తూ.. పురుషులను ప్రలోభపెట్టిందని, చాలా మందిని ఆమె తన ట్రాప్‌లో పడేసినట్టు తేలింది. ఇప్పటి వరకు ఆమె ఎనిమిది పెళ్లిళ్లు చేసుకున్నట్లు తేలింది. ఆమె కనిపించకుండా పోయిన నాటి నుండి ఆమె ఫోన్ స్విచ్ఛాప్ అయిపోయింది. ఆమె కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు. కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో ఆమె బాధితులన్నట్లు తెలుస్తుంది.