దేశ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. చిన్న చిన్న కారణాలే తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు, భార్యా భర్తల మధ్య గొడవలకు కారణాలవుతున్నాయి. ఇవి చిలికి చిలికి గాలి వానలా మారినట్లు.. అఘాయిత్యాలకు కారణాలవుతున్నాయి. తాజాగా ఓ ఇంట్లో నెలకొన్న వివాదం పెను విపత్తుకు దారి తీసింది.
భారతదేశం పలు కుటుంబ వ్యవస్థల కలయిక. కానీ నేడు ఈ కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం అవుతుంది. చిన్న చిన్న కారణాలే తల్లిదండ్రులు, కుమారులు, కుమార్తెలు, భార్యా భర్తల మధ్య గొడవలు రగులుతున్నాయి. ఇవి పగ, ప్రతీకారాలు దారి తీస్తున్నాయి. చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని, మనస్సును కుదుట పరచుకోలేక తగాదాలతో నిత్యం ఇల్లు ఓ యుద్ధ కాండలా మారిపోతుంది. దీని వల్ల ఓ కుటుంబం నడిరోడ్డున పడుతుంది. చివరకు ఆ కుటుంబం నలుగురిలో అవహేళనకు గురౌతుంది. ఆ ప్రభావం పిల్లల మనస్సులో ప్రభావం చూపుతోంది. చివరకు పిల్లల్లో నేర ప్రవృత్తి వైపు దారి తీసేలా చేస్తోంది. అటువంటిదే ఈ ఘటన. ఇది ఆంధ్రప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
కుటుంబ కలహాల కారణంగా భర్తను భార్య, చిన్న కుమారుడు కలిసి హతమార్చిన సంఘటన కృష్ణాజిల్లాలో చోటుచేసుకుంది. పెనమలూరు మండలం కానూరు పరిధిలో జరిగిన ఈ హత్య స్థానికంగా కలకలం సృష్టించింది. వివరాల్లోకి వెళితే కానూరులోని టైం హాస్పిటల్స్ సమీపంలో నివసిస్తున్న సాలిగ్రామ్ సురేష్, అరుణ దంపతులు. వీరికి వివాహం అయ్యి 24 ఏళ్లు పూర్తయింది. సురేష్ ఆటో నగర్‌లో పని చేస్తుంటాడు. వీరికి ఇద్దరు కుమారులున్నారు. వీరిలో పెద్ద కుమారుడు ఐదేళ్ల క్రితం ట్రాన్స్ జెండర్‌గా మారిపోయాడు. తన పేరును రోజాగా మార్చుకుని ఇంటికి దూరంగా తెలంగాణలోని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్ నగర్‌లో నివసిస్తున్నాడు. అయితే ఇటీవల పెద్ద కుమారుడు ఇంటికి వచ్చాడు.
పెద్ద కుమారుడు ట్రాన్స్ జెండర్‌గా మారడం ఇష్టం లేని తండ్రి అతడితో గొడవకు దిగాడు. గురువారం సాయంత్రం పెద్ద కుమారుడు కాగజ్‌నగర్‌కి వెళ్లిపోయాడు. అయితే పెద్ద కుమారుడితో వివాదంపై భర్త సురేష్, భార్య అరుణ మధ్య తగాదా నెలకొంది. పెద్ద కుమారుడికి తల్లి, చిన్న కొడుకు ఆకాష్ మద్దతుగా నిలిచారు. ఈ విషయంపైనే సురేష్‌తో భార్య , చిన్న కుమారుడు గొడవ పడ్డారు. ఈ వివాదం ఘర్షణకు దారి తీయగా.. సురేశ్ మృతి చెందాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో వారు వచ్చి వివరాలు సేకరించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. కుటుంబ కలహాల కారణంగా అతడి హత్య జరిగిందని నిర్ధారించిన పోలీసులు, అందుకు కారుకులుగా భార్య అరుణ, చిన్నకుమారుడు ఆకాష్ లేనని గుర్తించి వారిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు.