సీమా, జూలీ, అంజు, పోలాక్ బార్బరా ఈ మహిళలంతా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల కోసం స్వదేశాలను వీడి పరాయి దేశాలకు పరుగులెత్తారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మాటల ముచ్చట్లు కలిపి, ఆపై ప్రేమ వ్యవహారం నడిపి
సీమా, జూలీ, అంజు, పోలాక్ బార్బరా ఈ మహిళలంతా సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తుల కోసం స్వదేశాలను వీడి పరాయి దేశాలకు పరుగులెత్తారు. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా గ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల్లో మాటల ముచ్చట్లు కలిపి, ఆపై ప్రేమ వ్యవహారం నడిపి, ప్రియుడి కోసం ఖండాంతరాలు దాటేశారు. సీమాది ఒక తరహా ప్రేమ అయితే.. అంజుది మరో రకం. పోలాండ్ మహిళ పోలాక్ బార్చరాది మరో తరహా ప్రేమకథ. కానీ వీటన్నింటికీ కారణం సోషల్ మీడియానే. వీరందరూ పెళ్లైన మహిళలే. వీరిలో అంజు మాత్రమే భారత నారి. పాకిస్తాన్‌లో ఉన్న ప్రియుడి కోసం వెళ్లిపోయింది. ప్రేమ గుడ్డి అనేందుకు ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి చెప్పండి. కానీ సోషల్ మీడియాలో మొదలైన ప్రేమకథలన్నీ సుఖాంతం అవుతాయా అంటే.. కాదనేందుకు ఈ కథనం ఓ ఉదాహరణ.
ఫేస్ బుక్ ద్వారా ఓ వ్యక్తి పరిచయమ్యాడు. ప్రేమ డ్రామా ఆడాడు. నువ్వు లేనిదే లేనన్నాడు. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అతడి మాయ మాటలకు నమ్మిన యువతి నిలువెల్లా మోసపోయింది. చివరకు అతడు ఛీ కొట్టడంతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలోని బెంగళూరులో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మాండ్యాకు చెందిన అక్షయ్ భసవేశ్వర్‍లో జీవిస్తున్నాడు. అతడు జిమ్ ట్రైనర్. మూడేళ్ల క్రితం బెంగళూరుకు చెందిన సాఫ్ట్ వేర్ కమ్ మోడల్ విద్యశ్రీ ఫేస్ బుక్ ద్వారా పరిచయమైంది. మీ అభిమానిని అంటూ వల వేశాడు. అతడినిని నమ్మి ప్రేమించింది. ఈ మూడేళ్లు ప్రేమ పక్షుల్లా విహరించారు. తనను పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో అతడిని నమ్మి తనువు, మనస్సు, ధనాన్ని అందించింది. అయితే అప్పుడప్పుడు విద్యశ్రీ నుండి అవసరాలకు డబ్బులు తీసుకునేవాడు. అయితే పెళ్లి చేసుకోమని అడిగే సరికి, తాను ఇంకా సెటిల్ కాలేదని, రెండేళ్లు ఆగాలని చెప్పుకుంటూ వచ్చాడు.
అయితే ఇంట్లో తనను పెళ్లి చేసుకోవాలని బలవంతపెడుతున్నారని చెప్పడంతో.. ఆమె గుండెల్లో బాంబ్ పేల్చాడు. ‘నేను పెళ్లి చేసుకోలేను’అని తెగేసి చెప్పాడు. మీ తల్లిదండ్రులు చూసిన సంబంధం చేసుకోవాలని చెప్పడంతో మనస్థాపానికి గురైంది. అప్పటి వరకు తనెంటే ఎంతో ప్రేమగా ఉన్నట్లు నటించిన ప్రియుడు.. ఇప్పుడు మోహం చాటేస్తుండటంతో క్షోభకు గురై డెత్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకుంది. ‘నా చావుకు అక్షయ్ కారణం. అక్షయ్ నన్ను కుక్కలా ట్రీట్ చేశాడు. నా దగ్గర తీసుకున్న లక్షా 76 వేలు అడిగే సరికి.. నన్ను, నా కుటుంబ సభ్యుల గురించి హీనంగా మాట్లాడి ఫోన్ స్విచ్ఛాఫ్ చేశాడు. ఈ కారణంగా నేను డిప్రెషన్‌కు గురయ్యా. ఇక నేను బతకలేను. అమ్మా,నాన్ననన్ను క్షమించండి. అమ్మాయిలు.. దయచేసి ఎవ్వరినీ ప్రేమించవద్దు. ఈ ప్రపంచానికి గుడ్ బై’అంటూ సూసైడ్ రాసి చనిపోయింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపడుతున్నారు.