అనుమానం పెనుభూతమే కాపురాల్లో చిచ్చు పెడుతోంది. చెప్పుడు మాటలు, కంటికి కనిపించిందే నిజమని నమ్మి భార్య భర్తను వేధించడం.. భర్తను భార్య ప్రశ్నించడం జరుగుతుంది. భార్య అందగా ముస్తాబు అయినా, పరాయి వ్యక్తులతో మాట్లాడినా భరించలేకపోతాడు భర్త.
అనుమానం పెనుభూతమే కాపురాల్లో చిచ్చు పెడుతోంది. చెప్పుడు మాటలు, కంటికి కనిపించిందే నిజమని నమ్మి భార్య భర్తను వేధించడం.. భర్తను భార్య ప్రశ్నించడం జరుగుతుంది. భార్య అందగా ముస్తాబు అయినా, పరాయి వ్యక్తులతో మాట్లాడినా భరించలేకపోతాడు భర్త. అలాగే తనను కాకుండా మరో స్త్రీ వంక భర్త చూసినా ఇక అతడికి చుక్కలు చూపిస్తుంటుంది భార్య. వీటికి తోడు అగ్నిలో ఆజ్యంలా అత్త, మామల పోరు, చాడీలు, సాధింపులు, ఆడ పడుచుల గోల వెరసి భార్యా భర్తల మధ్య బంధం మరింత బలహీనపడుతుంది. దీంతో మనస్పర్థలు ఏర్పడి.. పిల్లల ముందే తన్నుకు చస్తుంటారు. చివరకు మనస్థాపానికి గురై అఘాయిత్యాలకు పాల్పడిన ఘటనలు ఎన్నో. తాజాగా అటువంటి ఘటనే బీహార్‌లో చోటుచేసుకుంది.
భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్య చేసుకోగా.. వెంటనే భార్య కూడా బలవన్మరణానికి పాల్పడిన ఘటన ముజఫర్‌పూర్ జిల్లాలో జరిగింది. ఆవేశంలో దంపతులు తీసుకున్న నిర్ణయంతో వారి బిడ్డ అన్యాయం అయ్యాడు. వివరాల్లోకి వెళితే సదర్ పోలీస్ స్టేషన్ పరిధితో ఫర్డో గోలా బ్రిడ్జి సమీపంలోని అద్దె ఇంట్లో నివసిస్తున్నారు భార్యా భర్తలు విక్రమ్ సింగ్ లాలూ, షబ్నంలు. వీరికి 2018లో పెళ్లింది. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. విక్రమ్ తండ్రి వృత్తి రీత్యా ఉపాధ్యాయుడు కాగా, రెండేళ్ల క్రితం హఠాన్మరణం చెందాడు. కారుణ్య నియామకం కింద తండ్రి ఉద్యోగం కోసం విక్రమ్ దరఖాస్తు చేసుకున్నాడు. ఈ దరఖాస్తు ప్రభుత్వ పరిశీలనలో ఉంది. అంతలోనే భార్యా భర్తలు ఇద్దరు ఈ దారుణానికి ఒడిగట్టారు. అయితే విక్రమ్ తల్లి విభాదేవి చెబుతున్న వివరాల ప్రకారం.. పెళ్లైన కొద్ది రోజుల నుండే కొడుకు,కోడలి మధ్య గొడవలు ప్రారంభమయ్యాయని పేర్కొంది. షబ్నం భర్తపై దాడి చేసేదని, పరువు పోతుందని కొడుకు విక్రమ్ ఎవ్వరికీ చెప్పలేదని తెలిపింది.
విక్రమ్ పని మీద కొన్ని రోజుల క్రితం ఇంటి నుండి బయటకు వెళ్లాడని, తిరిగొచ్చేసరికి షబ్నం మరోవ్యక్తితో పడక గదిలో ఉండటాన్ని చూసి చాలా బాధపడ్డాడని చెప్పింది. ఈ విషయాన్ని విక్రమ్ తన అత్తమామలకు చెప్పగా..వారు పట్టించుకోలేదని తెలిపింది. ఇటీవల విక్రమ్‌పై షబ్నం కత్తితో దాడి చేసిందని, దాంతో అతడు చాలా రోజుల పాటు చికిత్స పొందాడని తెలిపింది. కోడలు తమను కూడా వేధించినట్లు అత్త విభాదేవి తెలిపింది. మంగళవారం కూడా గొడవ జరిగి.. వేర్వేరు గదుల్లో పడుకున్నారని, తెల్లారే సరికి విక్రమ్ గదిని తలుపుకొడితే తీయలేదని, ఆ తర్వాత చూడగా.. విక్రమ్ ఆత్మహత్య చేసుకున్నట్లు కనిపించిందని అత్త చెబుతుంది. ఆ తర్వాత భర్త చనిపోయిన విషయం సోదరుడికి ఫోన్ చేసి చెప్పిన షబ్నం.. తాను కూడా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు చెప్పి.. మరో గదిలోకి వెళ్లి ఉరి వేసుకుంది. ఈ ఘటనలో బిడ్డ అనాథ అయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.