పొరపాటున రాంగ్ అడ్రసుకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టామనుకోండి..ఆ ఇంట్లో ఉండే వాళ్లు ఏమంటారు. మీరొచ్చిన అడ్రసు సరైందీ కాదని చెబుతారు. కానీ ఆ ఇంటి యాజమాని ఏం చేశాడో తెలిస్తే విస్తు పోవడం మనవంతౌతుంది. బెల్ మోగించాడన్న అకారణంగా కాల్పులు చేశాడో వ్యక్తి.
మహా నగరంలో, పట్ణణాల్లో అడ్రసులు తికమకగా ఉంటాయి. ఒక అడ్రసుకు వెతకబోయి, మరో అడ్రసుకు వెళ్లిన దాఖలాలు ఉన్నాయి. అయితే పొరపాటున రాంగ్ అడ్రసుకు వెళ్లి కాలింగ్ బెల్ కొట్టామనుకోండి..ఆ ఇంట్లో ఉండే వాళ్లు ఏమంటారు. మీరొచ్చిన అడ్రసు సరైందీ కాదని చెబుతారు. లేదంటే ఆ అడ్రసు తెలిస్తే.. వాళ్లకు అలా వెళ్లాలి, ఇలా వెళ్లాలి అని మార్గ నిర్దేశకం చేస్తారు. అంతేకానీ వారిపై దాడి చేస్తారా లేదు కదా.. కానీ ఓ కుర్రాడు పొరపాటున పక్కింటి డోర్ బెల్ మోగించినందుకు.. ఆ ఇంటి యాజమాని ఏం చేశాడో తెలిస్తే విస్తు పోవడం మనవంతౌతుంది. అసలు అతడు ఎందుకు వచ్చాడు, దేని కోసం వచ్చాడో కూడా చూడకుండా .. బెల్ మోగించాడన్న అకారణంగా కాల్పులు చేశాడో వ్యక్తి.
ఈ ఘటన అమెరికాలోని మిస్సోరిలో చోటుచేసుకుంది. రాల్ఫ్ పాల్ యార్ల్ (16) అనే నల్లజాతీయ (ఆఫ్రికన్ అమెరికన్) యువకుడు తన కవల సోదరుల కోసం వెతుకుతున్నాడు. అలా వెతుకుతూ పొరబాటున ఓ ఇంటి కాలింగ్ బెల్ మోగించాడు. డోర్ కూడా రెండు, మూడుసార్లు తట్టాడు. మళ్లీ బెల్ నొక్కడంతో ఆ ఇంటి నుంచి బయటకు వచ్చిన 85 ఏళ్ల వృద్ధుడు ఆండ్రూ లెస్టర్.. తుపాకీతో అతనిపై నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపాడు. రెండు తూటాలు ఆ టీనేజర్ తలలోకి దూసుకెళ్లాయి. ఆ దెబ్బకు అక్కడికక్కడే కుప్పకూలిన రాల్ఫ్.. తనని కాపాడాల్సిందిగా గట్టిగా కేకలు వేసి, స్పృహ కోల్పోయాడు. ఈ కేకలు విన్న జేమ్స్ లించ్ అనే స్థానికుడు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకొని, ఆ కుర్రాడ్ని ఆసుపత్రికి తరలించాడు.
మరోవైపు.. నిందితుడ్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు కోర్టులో హాజరు పరచగా.. దోషిగా నిర్ధారించి.. బెయిల్ ఇవ్వడంతో.. గంటల వ్యవధిలోనే విడుదల అయ్యాడు. దీంతో.. ప్రజాగ్రహం కట్టలు తెంచుకొని, నిరసనలు వెల్లువెత్తాయి. నల్లజాతీ యువకుడిపై కాల్పులు జరిపితే అలా ఎలా వదిలేస్తారని ప్రశ్నల వర్షం కురిపించారు. ఇది జాత్యాహంకారంతో జరిగినే ఘటన అని, దీనిపై పోలీసులు చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్లు చేశారు. రాల్ఫ్ అత్త ఫెయిత్ స్ఫూన్‌మూర్ మాట్లాడుతూ.. తన మేనల్లుడు కెమికల్ ఇంజనీరింగ్ చదవాలనుకున్నాడని, మంచి ప్రతిభావంతుడైన విద్యార్థి అని చెప్పారు.