Crime News : ఒకే మహిళతో ఇద్దరు స్నేహితుల అక్రమ సంబంధం గొడవకు దారి తీసింది. ఆ గొడవ ముదిరి ఒకరి ప్రాణం తీసే స్థాయికి దిగజారింది. మహిళ విషయంలో అడ్డు వస్తున్నాడన్న కోపంతో ఓ వ్యక్తి స్నేహితుడ్ని హత్య చేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఉత్తర ప్రదేశ్లోని బోదాన్ జిల్లాకు చెందిన సంజీవ్, జస్బీర్ మంచి స్నేహితులు. వీరికి ఒకే మహిళతో అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ విషయంలో గత కొన్ని నెలలుగా ఇద్దరికీ గొడవలు జరుగుతూ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో జస్బీర్.. సంజీవ్ అడ్డు తొలగించుకోవాలని భావించాడు. తన ముగ్గురు సోదరులు సత్య ప్రకాశ్, కల్లు, బ్రిజ్‌పాల్‌లతో కలిసి ఓ పథకం వేశాడు. వారు ఫిబ్రవరి 28వ తేదీన సంజీవ్‌ను ఊరి బయటకు తీసుకెళ్లారు. వెంట తెచ్చుకున్న బీరులో సంజీవ్‌కు తెలియకుండా విషం కలిపారు. ఆ తర్వాత దాన్ని అతడికి ఇచ్చారు. విషం కలిపిన బీరు తాగిన కొద్దిసేపటికి సంజీవ్ నేలపై పడిపోయాడు. వాళ్లు అతడ్ని రాళ్లతో కట్టి చంపారు.
ముఖాన్ని గుర్తు పట్టలేకుండా చేసి, దగ్గరలోని రైల్వే ట్రాకుపై పడేశారు. హత్యను రైలు ప్రమాదంగా చిత్రీకరించాలని భావించారు. మార్చి 1న శవాన్ని గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. జస్బీర్ సోదరులు ముగ్గుర్ని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది. పరారీలో ఉన్న జస్బీర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
చదవండి : గదిలో బాయ్‌ఫ్రెండ్.. బాత్రూంలో బ్యూటిషియన్ శవం.. ఇంతకీ ఏమైంది?..
తమ్ముడి ఫ్రెండ్‌తో అక్క సంబంధం.. కనిపించకుండా పోయిన తమ్ముడు.. 6 నెలల తర్వాత..
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.