మహారాష్ట్ర- అక్షయ తృతీయ.. దక్షిణాదిలో అంతగా ప్రాధాన్యత లేకున్నా.. ఉత్తరాదిలో మాత్రం అక్షయ తృతీయ ను చాలా ఘనంగా జరుపుకుంటారు. ఇక అక్షయ తృతీయ అంటేనే లక్ష్మి. లక్ష్మి కి ప్రతిరూపం పసిడి.. అంటే బంగారం. అక్షయ తృతీయ రోజు కాస్తైనా బంగారం కొంటే మంచిదని అంతా భావిస్తుంటారు. అందుకే అక్షయ తృతీయ రోజు కనీసం ఒక గ్రాము బంగారమైన కొంటుంటారు. ఇక ఉత్తరాదిలో అక్షయ తృతీయ ను భక్తి శ్రద్ధలతో జరువుకుంటారు. లక్ష్మీ దేవి అమ్మవారిని అక్షయ తృతీయ రోజు ప్రత్యేకంగా పూజిస్తారు. అక్షయ తృతీయ ను పురస్కరించుకుని మహారాష్ట్రలోని విఠల్-రుక్మిణి ఆలయాన్ని 7 వేల మామిడి పండ్లతో ప్రత్యేకంగా అలంకరించారు. కరోనా వైరస్ దేశాన్ని కలవరపెడుతున్న నేపథ్యంలో ఆలయ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలోని గర్భగుడి నుంచి మందిరం మొత్తం మామిడి పండ్లతో అలంకరించారు. పచ్చని తోరణాల మధ్య పసుపు పచ్చని మామిడి పండ్లతో ఎంతో అద్భుతంగా అమ్మవారిని అలంకరించారు.
కరోనా వైరస్ వల్ల భక్తులను ఆలయంలోని అనుమతించలేదని ఆలయ నిర్వాహకులు తెలిపారు. పుణెకు చెందిన వినాయక్ కట్చి అనే భక్తుడు ఈ మామిడి పండ్లను సమర్పించారు. ఇక విఠల్ రుక్మిణి ఆలయ ఫోటోలు, వీడియోలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇక ఈ ఆలయంలో ప్రతి వేసవిలో మామిడి పండ్లతో అమ్మవారిని అలకరించడం ఆనవాయితీగా వస్తోంది. గత సంవత్సరం 3100 మామిడి పండ్లతో అమ్మవారిని, ఆలయాన్ని అలకరించారు. ఇక ఈ సారి ఆలయాన్ని అలంకరించిన ఈ మామిడి పండ్లను కోవిడ్ బాధితులకు అందించాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు. మామిడి పండ్లతోపాటు పుచ్చకాయలు, ఆపిల్ తదితర పండ్లను కూడా ఆలయంలో అలకరించారు. వీటన్నింటినీ కరోనా బాధితులకు పంచిపెట్టాలని ఆలయ నిర్వాహకులు నిర్ణయించారు.