Conductor Jhansi: కండెక్టర్ ఝాన్సీ.. ప్రస్తుతం తెలుగు ప్రజలకు పెద్దగా పరిచయం అక్కర్లేని పేరు. శ్రీదేవీ డ్రామా కంపెనీ షోలో పల్సర్ బైకు పాటకు దమ్ము రేపే స్టెప్పులేసి పిచ్చ పాపులారిటీ తెచ్చుకున్నారామె. పదుల కొద్దీ టీవీ షోలు, వందల కొద్దీ స్టేజీ డ్యాన్స్ షోలతో రాని పేరు.. శ్రీదేశీ డ్రామా కంపెనీలో పల్సర్ బైకు పాటకు డ్యాన్స్ వేయటంతో వచ్చింది. ప్రస్తుతం టీవీ షోలు, డ్యాన్స్‌లతో మరింత బిజీ అయ్యారామె. ఈ నేపథ్యంలోనే కండెక్టర్ ఝాన్సీ పలు మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలలో తన వ్యక్తిగత, వృత్తి పరమైన విషయాలను పంచుకున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో భర్తతో అనుబంధం గురించి మాట్లాడారు. భర్తతో భార్య ఎలా ఉండాలన్న దాని గురించి, విడాకుల గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.
ఆమె మాట్లాడుతూ.. ‘‘ విడిపోవాలని అని అనుకున్నపుడు ఆడవాళ్లు కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. ఎందుకంటే.. నోటి దురుసు ఆడవాళ్లకే ఎక్కువగా ఉంటది. అది నిజమే.. మనం గొప్ప అని కాకుండా. భర్త తర్వాతే మనం గొప్ప అనుకుంటే ఎటువంటి కాపురంలోనూ నిప్పులు రావు. లేదు. మా ఆయన ఇది.. నేను ఇంకా తోపు అనుకుంటే మాత్రం కన్ఫర్మ్‌గా విభేదాలు రావటం, విడిపోవటం మాత్రం జరుగుతుంది. ఎంత ఎదిగినా.. ఎంత సంపాదించినా ఆడది.. ఆడదే.. అంటే భర్త దగ్గర ఉండేది.. పుట్టింట్లో ఉండేది కాదు. ఆడది అంటే అర్థం అత్తింట్లో ఉండేది అని. ఒక్కరిగా ఉన్నపుడు మనం ఇష్టం వచ్చిటన్లు చేయోచ్చు. ఇద్దరూ ఒక అండర్‌స్టాండింగ్‌తో..
పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకుని, మరో ఇద్దరికి జీవితం ఇచ్చినపుడు వాళ్ల కోసమైనా కలిసి ఉండాలి. తిట్టుకున్నా.. కొట్టుకున్నా ప్రేమగా ఉండాలి. మేము నెలకు 30 రోజుల్లో 20 రోజులు తిట్టుకుంటాం. తను 10 రోజులు మాట్లాడకపోతే.. నేను ఒక 10 రోజులు మాట్లాడను. నేను కొంచెం పౌరుషం ఉన్న టైపు. కొట్టినా అమ్మా వాళ్ల ఇంటికి వెళ్లను. ఆయనతో మాట్లాడటం మానేస్తాను. ఇంట్లో తినటం మానేస్తాను. బయట తింటాను. అది కూడా నేను ఎదురు సమాధానాలు ఇవ్వటం వల్లే దెబ్బలు పడ్డాయి. తనకు కోపం వచ్చినపుడు డౌన్ అయిఉంటే కొట్టేవాడు కాదు. పెళ్లైన ఇన్ని సంవత్సరాలకు మా ఆయన ఐదు సార్లే నన్ను కొట్టాడు’’ అని చెప్పుకొచ్చారు.